అందుబాటులోకి మరో కరోనా వ్యాక్సిన్

అందుబాటులోకి మరో కరోనా వ్యాక్సిన్

పూణేలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్​ ఇండియా ఉత్పత్తి చేస్తున్న కొవొవ్యాక్స్ కరోనా టీకా ఎమర్జెన్సీ వాడకానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) ఆమోదం తెలిపింది. అమెరికన్ కంపెనీ నోవావ్యాక్స్ ఇంక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ను సీరమ్ ఇనిస్టిట్యూట్ కొవొవ్యాక్స్ పేరుతో ఉత్పత్తి చేస్తోందని, ఈ టీకాను ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ లో చేర్చామని శుక్రవారం డబ్ల్యూహెచ్ వో ప్రకటించింది. పేద దేశాలకు కరోనా టీకాలను అందించేందుకు డబ్ల్యూహెచ్ వో ఆధ్వర్యంలో ఏర్పడిన కొవాక్స్ ప్రోగ్రాం కింద కొవొవ్యాక్స్ ను సప్లై చేయనున్నారు. కొవొవ్యాక్స్ తో పేద దేశాల్లో వ్యాక్సినేషన్ కు ఊతం లభిస్తుందని భావిస్తున్నారు. కరోనాపై పోరాటంలో ఇది మరో మైలురాయి అని సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా పేర్కొన్నారు. ఈ టీకా సేఫ్టీ, ఎఫికసీ అద్భుతంగా ఉన్నాయని ట్వీట్ చేశారు.