చైనాకు చేరుకున్న డబ్ల్యూహెచ్‌వో ఎక్స్‌పర్ట్స్‌.. కరోనా పుట్టుకపై విచారణ

చైనాకు చేరుకున్న డబ్ల్యూహెచ్‌వో ఎక్స్‌పర్ట్స్‌.. కరోనా పుట్టుకపై విచారణ

న్యూఢిల్లీ: కరోనా పుట్టుకకు చైనానే కారణమని అగ్రరాజ్య అధినేత డొనాల్డ్‌ ట్రంప్ చాలా మార్లు విమర్శించిన సంగతి తెలిసిందే. కరోనా పుట్టుకకు సంబంధించి ఇన్వెస్టిగేట్ చేయాలని మేలో జరిగిన వరల్డ్‌ హెల్త్ అసెంబ్లీలో సుమారు 120 పైగా దేశాలు డిమాండ్ చేసిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో చైనాపై విచారణ చేపడతామని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది. ఈ విచారణకు డబ్ల్యూహెచ్‌వోనే ప్రాతినిధ్యం వహించాలని, అది కూడా తమ దేశంలో వైరస్ నియంత్రణలోకి వచ్చాకే చేయాలని చైనా తెలిపింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా డబ్లూహెచ్‌వో ఎక్స్‌పర్ట్స్‌ చైనాకు చేరుకున్నారు. రెండ్రోజుల పాటు అక్కడే ఉండనున్న నిపుణులు కరోనా మూలాలను తెలుసుకునే యత్నాల్లో బిజీ కానున్నారు. ఈ ఇన్వెస్టిగేషన్‌లో డబ్ల్యూహెచ్‌వో పరిధి, నిబంధనలను తెలపడానికి, వారికి సహకరించడానికి ఓ యానిమల్ హెల్త్ ఎక్స్‌పర్ట్‌, ఒక ఎపిడిమియాలజిస్ట్‌ కృషి చేస్తారని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. కరోనా వైరస్ గబ్బిలాల నుంచి పుట్టి ఉండొచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు.