మోదీకి పోటీ ఎవరంటే : శశిథరూర్

మోదీకి పోటీ ఎవరంటే : శశిథరూర్
  •      మేం వ్యక్తిని కాదు.. కూటమిని ఎన్నుకుంటం 

న్యూఢిల్లీ :  దేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రత్యామ్నాయం ఎవరో చెప్పాలంటూ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్  సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ తనదైన శైలిలో బదులిచ్చారు. "పార్లమెంటరీ వ్యవస్థలో ఈ ప్రశ్న అసంబద్ధమైనది. అధ్యక్ష వ్యవస్థ తరహాలో  మనం ఒక వ్యక్తిని ఎన్నుకోవడం లేదు. మన దేశ బహుళత్వం, వైవిధ్యం, సమ్మిళిత వృద్ధిని సంరక్షించడం కోసం రూపొందించిన విధివిధానాలను పాటించే పార్టీ లేదా  కూటమిని ఎన్నుకుంటాం.

 ఇక్కడ ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయం ఎవరంటే.. వ్యక్తిగత అహాన్ని పక్కనబెట్టి ప్రజల సమస్యలపై పోరాడే అనుభవజ్ఞులు, సమర్థులైన నాయకుల బృందమే. అందులో నుంచి ఎవరిని ప్రధానిగా ఎన్నుకోవాలన్నది సెకండరీ విషయం. మన ప్రజాస్వామ్యాన్ని, భిన్నత్వాన్ని పరిరక్షించడమే ప్రథమ ప్రాధాన్యం” అని విలేకరులు అడిగిన ప్రశ్నకు శశిథరూర్ సమాధానం చెప్పారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.