
ముంబై రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసింది. అతడితోపాటు మరో ఏడుగుర్ని ఎన్సీబీ అదుపులోకి తీసుకుంది. అయితే వీరిలో ఒక అమ్మాయి కూడా ఉండటం ఆసక్తిని రేపుతోంది. ఆమె పేరు మున్మున్ ధమేచా. బిజినెస్ ఫ్యామిలీకి చెందిన 39 ఏళ్ల ధమేచా.. ఓ ఫ్యాషన్ మోడల్. మధ్య ప్రదేశ్‌కు చెందిన మున్మున్‌కు తల్లిదండ్రులు లేరు. కొంతకాలం కింద వారిద్దరూ మృతి చెందారు. మున్మున్‌కు ఒక సోదరుడు ఉన్నాడు. అతడి పేరు ప్రిన్స్ ధమేచా. ప్రస్తుతం అతడు ఢిల్లీలో పని చేస్తున్నాడు.