ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్ ఎవరు?

ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్ ఎవరు?

జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ తర్వాత ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో మరో మూవీ వస్తుంది. ఆర్ఆర్ఆర్ వంటి భారీ హిట్ తర్వాత ఎన్టీఆర్ ఆచార్య తో ప్లాప్ తర్వాత కొరటాల కలిసి చేస్తున్న చిత్రమిది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి అనిరుథ్ మ్యూజిక్ అందిస్తుండగా రత్నవేలు కెమెరామెన్ గా పనిచేస్తున్నారు. అయితే టెక్నిషియన్స్ ని అనౌన్స్ చేశారు గానీ మూవీలో హీరోయిన్ మాత్రం ఇప్పటివరకు ఫిక్స్ కాలేదు.అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు? అన్నది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ముందుగా ఈ మూవీలో ఆలియా భట్ ను అనుకున్నారు. ఆమెకు కొరటాల కథ కూడా వినిపించాడట. అయితే ఏమైందో ఏమోగానీ ఆమె ఈ మూవీ చేయట్లేదు. దీంతో హీరోయిన్ ని వెతికే పనిలో పడ్డాడు కొరటాల. కియారా అద్వానీ, జాన్వీ కపూర్, అనన్య పాండే, సాయిపల్లవి, కీర్తి సురేష్ పేర్లను పరిశీలిస్తున్నారు మేకర్స్. మరి చివరకు ఎవరు ఫిక్స్ అవుతారో చూడాలి. కాగా ఈ మూవీ షూటింగ్ జూన్ నుండి ప్రారంభంకానుంది. ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నారు ఎన్టీఆర్, కొరటాల.