
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా(Thamannaah).. విజయ్ వర్మ(Vijay Vama)తో డేటింగ్ లో ఉంది అంటూ వస్తున్న వార్తలు నిజమేనంటూ ఒప్పేసుకుంది. తాజాగా ఈ జంట లస్ట్ స్టోరీస్2(Lust Stories2) ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా తమన్నా.. విజయ్ గురించి, అతనితో ప్రేమ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. "విజయ్ అంటే నాకు చాలా ఇష్టం, నాకేం కావాలో తనకు బాగా తెల్సు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నాకు అండగా ఉంటాడనే నమ్మకం నాకుంది" అంటూ తన ప్రియుడు విజయ్ గురించి తెగ పొగిడేసింది. దీంతో ప్రస్తుతం విజయ్ వర్మ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఈ విజయ్ వర్మ ఎవరు? అంటూ సెర్చింగ్ మొదలుపెట్టేశారు.
విజయ్ వర్మ బాలీవుడ్ నటుడిగానే చాలా మందికి తెల్సు.. కానీ అతను ఒక తెలుగువాడు, అందులోనూ తెలంగాణాకు చెందిన వ్యక్తి అని చాలా మందికి తెలియదు. విజయ్ వర్మ 1986 మార్చ్ 29న హైదరాబాద్ లో జన్మించాడు. విజయ్ తండ్రి హ్యాండీ క్రాఫ్ట్ బిజినెస్ చేసేవారు, తల్లి హౌజ్ వైఫ్. అతనికి ఇద్దరు అన్నయ్యలు.
విజయ్ వర్మకు చిన్నప్పటి నుండి నటన అంటే చాలా ఇష్టం. అందుకే డిగ్రీ చదువు పూర్తికాగానే.. 2005లో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(FTII) నుండి నటనలో గ్రాడ్యుయేషన్‌ను పూర్తిచేశాడు. కొన్నిరోజులు హైదరాబాద్‌లో థియేటర్ ఆర్టిస్ట్‌గా కూడా చేశాడు విజయ్. 2008లో "షోర్(Shore)" అనే షార్ట్ ఫిల్మ్‌తో తన నటనా జీవితాన్ని ప్రారంభించాడు. ఆతరువాత వరుసగా.. చిట్టగాంగ్(Chittagang), రంగేజ్(Rangej), గ్యాంగ్ ఆఫ్ గోస్ట్స్(Gang of ghosts) వంటి హిట్ చిత్రాలలో నటించాడు. ఇక 2016లో వచ్చిన పింక్(Pink) సినిమాతో విజయ్ వర్మకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక తెలుగులో నాని హీరోగా వచ్చింది MCA సినిమాలో విలన్ గా కనిపించాడు విజయ్.
ఇక విజయ్ వర్మ, తమన్నా కలిసి ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ఇక ఈ ఇద్దరు జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ "లస్ట్ స్టోరీస్ 2". ఈ మూవీ జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆఫ్ స్క్రీన్ లో ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట.. ఆన్ స్క్రీన్ ఎలా రెచ్చిపోయారో తెలియాలంటే జూన్ 29 వరకు ఆగాల్సిందే