
రోగుల చికిత్సలో ఉపయోగించే డీఫిబ్రోటైడ్ సోడియం(DEFITELIO (defibrotide sodium)) అనే మెడిసన్ని ఫేక్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెచ్చరించింది.
దీనిని వాడితే సైడ్ఎఫెక్ట్స్ వస్తాయని తద్వారా రోగి ప్రాణాలే పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. భారత్, టర్కీలలో ఇవి విచ్చలవిడిగా విక్రయిస్తున్నట్లు తెలిపింది.
ఈ మందుని హేమాటోపోయిటిక్ (రక్తం) స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకుంటున్న పెద్దలు, పీడియాట్రిక్ రోగులలో వెనో-ఆక్లూసివ్ డిసీజ్ చికిత్సకు యాంటిథ్రాంబోటిక్ ఏజెంట్‌గా ఉపయోగిస్తారు.
Also Read : నటి, రాజకీయ వేత్త రమ్య చనిపోయారంటూ పుకార్లు
వీటిపై తప్పుడు వివరాలు ముద్రించి అమ్ముతున్నారు. ఔషధ సరఫరాలో అగ్రగామిగా ఉన్న భారత్‌లోనూ ఫేక్ మెడిసన్విక్రయాలు జరగడంపట్ల డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది.
నిజమైన మెడిసన్ లాట్20G20Aతో ఉండి జర్మన్/ఆస్ట్రియన్ లో ప్యాకింగ్ చేసి ఉంటుందని తెలిపింది. ఫేక్ పై ఇలాంటి వివరాలకు బదులుగా వేరేవి ఉంటాయని తెలిపింది. ఈ మెడిసిన్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించడం ఇదే తొలిసారి కాదు. 2020లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, లాట్వియా, మలేషియా, సౌదీ అరేబియా వంటి దేశాల్లో నకిలీ డ్రగ్ విక్రయిస్తున్నట్లు అప్పుడే వెల్లడించింది.
అవయవాల మీద తీవ్ర ప్రభావం..
ఈ ఫేక్ మెడిసన్ వివరాలు చూసుకోకుండా పేషెంట్స్ కి వాడితే ప్రాణాపాయం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రకాల సైడ్‌ఎఫెక్స్ట్ దీర్ఘకాలంలో రోగి శరీరం వెంటే ఉంటాయని అవి వేర్వేరు అవయవాల మీద దుష్ప్రభావాన్ని చూపుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి మెడిసన్స్ తయారు చేస్తున్న వారిని కఠినంగా శిక్షిం చి వీటిని అరికట్టాలని వైద్యలు సూచిస్తున్నారు.