నటి, రాజకీయ వేత్త రమ్య చనిపోయారంటూ పుకార్లు

నటి, రాజకీయ వేత్త రమ్య చనిపోయారంటూ పుకార్లు

ప్రముఖ నటి దివ్య స్పందన చనిపోయారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆమె గుండెపోటుతో హఠాన్మరణం చెందారని పుకార్లు వినిపించాయి. అంతేకాదు..సోషల్ మీడియాలో RIP అంటూ అనేక మంది ప్రముఖులు, అభిమానులు నివాళులు అర్పించారు. 

చనిపోలేదు..తప్పుడు వార్తలు..

మరోవైపు నటి దివ్య స్పందన చనిపోయారన్న వార్తలు నిజం కావని ప్రముఖ జర్నలిస్టు చిత్ర సుబ్రమణ్యం స్పష్టం చేశారు. దివ్య చనిపోలేదని క్లారిటీ ఇచ్చారు. అవన్ని తప్పుడు వార్తలను చెప్పారు. తాను ఇప్పుడే దివ్య స్పందనతో మాట్లాడానని తెలిపారు. సెప్టెంబర్ 7వ తేదీన దివ్య స్పందనను కలుస్తానని వెల్లడించారు. 

సెప్టెంబర్ 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు నటి దివ్య స్పందన అలియాస్ రమ్య హఠాన్మరణం పొందారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆమె గుండెపోటుతో మృతి చెందారని పోస్ట్ చేశారు. దీంతో నిజమే అనుకుని అందరూ RIP అంటూ పోస్టులు పెట్టారు. 

ఇక నటి దివ్య స్పందన కన్నడ, తెలుగు, తమిళంలో శింబు, ధనుష్, సూర్యతో పలు సినిమాల్లో నటించారు. తెలుగులో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అభిమన్యుడులోనూ నటించారు. కుత్తు రమ్య పేరుతో ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు.2004లో నటుడు శింబుతో తమిళంలో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. ఆ తరువాత అతను ధనుష్ యొక్క పొల్లాదవన్, సూర్య వరణం అయర్ వంటి చిత్రాలలో నటించి ఫేమస్ అయింది. కన్నడ, తెలుగులో నటించిన రమ్యకు..12 ఏళ్లుగా తమిళంలో ఒక్క సినిమాలో కూడా అవకాశం రాలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా కూడా గెలుపొందారు.