ఆరోగ్యసేతు యాప్ భేష్ :WHO

ఆరోగ్యసేతు యాప్ భేష్ :WHO

కరోనా వైరస్ నుంచి  ప్రజలను అప్రమత్తం చేసేందుకు భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఆరోగ్యసేతు’ యాప్ పై ప్రపంచ ఆరోగ్యం సంస్థ(WHO) ప్రశంసలు కురిపించింది. కరోనా వ్యాప్తి నియంత్రణలో ఈ యాప్ అద్భుతంగా పని చేస్తోందన్నారు WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్. ఈస్టర్న్ మెడిటరేనియన్ రీజనల్ కమిటీ సమావేశంలో మాట్లాడిన ఆయన.. కరోనా కేసులను ట్రేస్ చేసే యాప్ లలో అన్నింటికన్న పెద్దది ఆరోగ్యసేతు అని అన్నారు. దాదాపు 15 కోట్ల మంది ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపారు.

కరోనా కేసులను గుర్తించడంలో ఈ యాప్ కీలకపాత్ర పోషిస్తోందని… దీంతో ఏయే ప్రాంతాల్లో కరోనా టెస్టులను ఎక్కువగా నిర్వహించాలనే నిర్ణయం తీసుకోవడానికి ఆరోగ్య శాఖకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతోందని చెప్పారు టెడ్రోస్.

కరోనా పాజిటివ్ వ్యక్తులు మన సమీపంలోకి వచ్చినప్పుడు బ్లూటూత్ ద్వారా ఈ యాప్ అప్రమత్తం చేస్తుంది. దీంతో పాటు మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్ని కరోనా కేసులు ఉన్నాయనే విషయాన్ని కూడా మనం తెలుకోవచ్చు.