కరోనా చికిత్సలో ఆ మెడిసిన్ వాడొద్దు : WHO

కరోనా చికిత్సలో ఆ మెడిసిన్ వాడొద్దు : WHO

 కరోనా ట్రీట్ మెంట్ కోసం నోటి ద్వారా తీసుకొనే యాంటీ పారాసైటిక్‌ ఐవర్‌ మెక్టిన్‌ మెడిసిన్  వినియోగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరిక జారీ చేసింది. కొత్త వ్యాధులపై అప్పటికే ఉన్న మందులను వినియోగించాల్సి వచ్చినప్పుడు ఔషధ భద్రత, సమర్థత చాలా ముఖ్యమని తెలిపింది. కరోనాకు ఐవర్ మెక్టిన్ ను వాడొద్దని సూచిస్తోంది. క్లినికల్ ట్రయల్స్  చేయకుండా ఐవర్ మెక్టిన్ ను వాడవద్దని WHO చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అన్నారు.

జర్మనీకి చెందిన మెర్క్ అనే ఫార్మా సంస్థ కూడా ఇదే సూచనలు జారీ చేసింది. తమ శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు ఐవర్ మెక్టిన్ వాడకంపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారని సంస్థ తెలిపింది. ఇప్పటిదాకా వచ్చిన ఫలితాల్లో కరోనాపై మందు ప్రభావం ఏమాత్రం లేదని తేలినట్టు తెలిపింది. భద్రత, ఔషధ సామర్థ్యంపైనా సరైన ఆధారాలు లభించలేదని చెప్పింది..

గత రెండు నెలల్లో ఐవర్ మెక్టిన్ పై WHO వార్నింగ్ ఇవ్వడం ఇది రెండోసారి.