ఫైనల్‌కు ఎవరు?.. ఇవాళ చెన్నై, ఢిల్లీ మధ్య క్వాలిఫయర్-1 మ్యాచ్

ఫైనల్‌కు ఎవరు?.. ఇవాళ చెన్నై, ఢిల్లీ మధ్య క్వాలిఫయర్-1 మ్యాచ్

దుబాయ్‌‌‌‌‌‌‌‌: ఓవైపు ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియెన్స్‌‌‌‌‌‌‌‌.. మరోవైపు జోరుమీదున్న యంగ్‌‌‌‌‌‌‌‌స్టర్స్‌‌‌‌‌‌‌‌.. ఒకరిదేమో మూడుసార్లు ట్రోఫీ గెలిచిన చరిత్ర.. మరొకరిది ఫస్ట్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌ కోసం తహతహ.. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే ఐపీఎల్‌‌‌‌‌‌‌‌–14 క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌–1లో చెన్నై సూపర్‌‌‌‌‌‌‌‌కింగ్స్‌‌‌‌‌‌‌‌.. ఢిల్లీ క్యాపిటిల్స్‌‌‌‌‌‌‌‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. లీగ్‌‌‌‌‌‌‌‌ దశలో రెండుసార్లు డీసీ చేతిలో ఓడినా.. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో మాత్రం సీఎస్‌‌‌‌‌‌‌‌కేనే ఫేవరెట్‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగుతోంది. గత 12 సీజన్లలో 11 సార్లు ప్లే ఆఫ్స్‌‌‌‌‌‌‌‌ రౌండ్స్‌‌‌‌‌‌‌‌ ఆడిన చెన్నైని తక్కువగా అంచనా వేస్తే ఢిల్లీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా లీగ్‌‌‌‌‌‌‌‌ స్టేజ్‌‌‌‌‌‌‌‌లో 20 పాయింట్లు నెగ్గినా.. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో గెలవడం డీసీకి కత్తిమీద సామే. కాగా, ఈ మ్యాచ్​లో నెగ్గిన జట్టు నేరుగా ఫైనల్​ చేరుతుంది. ఓడిన టీమ్​.. ఆర్​సీబీ-–కోల్​కతా మధ్య జరిగే ఎలిమినేటర్​ మ్యాచ్​లో నెగ్గిన జట్టుతో క్వాలిఫయర్​2లో పోటీ పడుతుంది.

అంతా ధోనీపైనే..

సీఎస్‌‌‌‌‌‌‌‌కే టీమ్‌‌‌‌‌‌‌‌ మొత్తం ఒక ఎత్తు అయితే ధోనీ మరో ఎత్తు. మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ఎంతటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా... తన క్రికెటింగ్‌‌‌‌‌‌‌‌ బ్రెయిన్‌‌‌‌‌‌‌‌తో సెకండ్లలో మలుపు తిప్పగల దిట్ట. కాబట్టి క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌లో చెన్నై విజయం మొత్తం ధోనీపైనే ఆధారపడి ఉంది. ఇక బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో రుతురాజ్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉండటం కలిసొచ్చే అంశం. డుఫ్లెసిస్‌‌‌‌‌‌‌‌ కూడా బ్యాట్‌‌‌‌‌‌‌‌ ఝుళిపిస్తే.. మిగతా పనిని రాయుడు, రైనా, బ్రావో చూసుకుంటారు. అయితే బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో ధోనీ తన మార్క్‌‌‌‌‌‌‌‌ ఫినిషింగ్‌‌‌‌‌‌‌‌ చూపెట్టలేకపోతున్నాడు. గత మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో విఫలమైన రైనా ప్లేస్‌‌‌‌‌‌‌‌లో రాబిన్‌‌‌‌‌‌‌‌ ఊతప్పను తీసుకుంటారా? చూడాలి. ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ రవీంద్ర జడేజా మరోసారి కీలకం కానున్నాడు. వీళ్లకు తోడు హేజిల్‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌, మొయిన్‌‌‌‌‌‌‌‌ అలీ, సీమ్‌‌‌‌‌‌‌‌ ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ బ్రావో సీఎస్‌‌‌‌‌‌‌‌కే ఫైనల్‌‌‌‌‌‌‌‌ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌కు మరింత బలంగా మారనున్నారు. బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో శార్దూల్‌‌‌‌‌‌‌‌, దీపక్‌‌‌‌‌‌‌‌ చహర్‌‌‌‌‌‌‌‌ మెరిస్తే సీఎస్‌‌‌‌‌‌‌‌కేకు తిరుగుండదు. 

స్టోయినిస్‌‌‌‌‌‌‌‌ వచ్చేనా?

ఫస్ట్‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌ వేటలో ఉన్న ఢిల్లీ కూడా ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌పై భారీ ఆశలు పెట్టుకుంది. ఇక్కడే గెలిచి డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా ఫైనల్‌‌‌‌‌‌‌‌ టిక్కెట్‌‌‌‌‌‌‌‌ దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే సీఎస్‌‌‌‌‌‌‌‌కేతో పోలిస్తే ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియెన్స్‌‌‌‌‌‌‌‌ తక్కువైనా.. టీమ్‌‌‌‌‌‌‌‌ పరంగా డీసీలో టాలెంట్‌‌‌‌‌‌‌‌కు కొదువలేదు. నాణ్యమైన ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్లు, స్పెషలిస్ట్‌‌‌‌‌‌‌‌ బ్యాట్స్‌‌‌‌‌‌‌‌మెన్‌‌‌‌‌‌‌‌, బౌలర్లు అందుబాటులో ఉండటం అదనపు ప్రయోజనం కలిగించనుంది. ఇప్పటివరకు ముగ్గురు ఫారిన్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లతోనే ఆడిన ఢిల్లీ.. స్టోయినిస్‌‌‌‌‌‌‌‌ ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌పై అంచనాకు రాలేకపోతున్నది. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు అతను అందుబాటులో ఉంటాడని కెప్టెన్‌‌‌‌‌‌‌‌ పంత్‌‌‌‌‌‌‌‌ ఆశాభావంతో ఉన్నాడు. డీసీ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ ధవన్‌‌‌‌‌‌‌‌, పృథ్వీ, పంత్‌‌‌‌‌‌‌‌, శ్రేయస్‌‌‌‌‌‌‌‌, హెట్‌‌‌‌‌‌‌‌మయర్‌‌‌‌‌‌‌‌పైనే ఆధారపడి ఉంది. ఒకవేళ స్టోయినిస్‌‌‌‌‌‌‌‌ వస్తే రీపల్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌కు పరిమితం కానున్నాడు. ఇక డీసీ బౌలింగ్‌‌‌‌‌‌‌‌ కూడా చాలా బలంగా ఉంది. ఆవేశ్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ (22 వికెట్లు), అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ (15), రబాడ (13), నోర్జ్‌‌‌‌‌‌‌‌ (9) సూపర్‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. అశ్విన్‌‌‌‌‌‌‌‌ మ్యాజిక్‌‌‌‌‌‌‌‌ చూపెడితే ఢిల్లీదే పైచేయి అవ్వొచ్చు.

తుది జట్లు (అంచనా)

ఢిల్లీ: రిషబ్‌‌‌‌‌‌‌‌ పంత్​(కెప్టెన్‌‌‌‌‌‌‌‌), పృథ్వీ, ధవన్‌‌‌‌‌‌‌‌, శ్రేయస్‌‌‌‌‌‌‌‌, హెట్‌‌‌‌‌‌‌‌మయర్‌‌‌‌‌‌‌‌, స్టోయినిస్‌‌‌‌‌‌‌‌/ రిపల్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌, అక్షర్‌‌‌‌‌‌‌‌, అశ్విన్‌‌‌‌‌‌‌‌, రబాడ, నోర్జ్‌‌‌‌‌‌‌‌, ఆవేశ్‌‌‌‌‌‌‌‌. చెన్నై: ధోనీ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌), రుతురాజ్‌‌‌‌‌‌‌‌, డుప్లెసిస్‌‌‌‌‌‌‌‌, మొయిన్​ అలీ, రాయుడు, రైనా/ ఊతప్ప, జడేజా, బ్రావో, శార్దూల్‌‌‌‌‌‌‌‌, దీపక్‌‌‌‌‌‌‌‌ చహర్‌‌‌‌‌‌‌‌, హేజిల్‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌.