అమెరికా వచ్చేవారికి ఆరోగ్య బీమా తప్పని సరి: ట్రంప్

అమెరికా వచ్చేవారికి ఆరోగ్య బీమా తప్పని సరి: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వలసదారుల విషయంలో మరో నిర్ణయం తీసుకున్నారు. అమెరికాకు రావాలనుకునే వారికి ఆరోగ్య బీమా తప్పని సరిగా ఉండాలని ట్రంప్ ఆదేశించారు. దీనికి సంబంధించిన బిల్లుపై కూడా ఆయన సంతకం కూడా చేశారు.

హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌ లేకుండా వలసదారులు USలో అడుగుపెడితే 30 రోజుల్లోగా బీమా సౌకర్యాన్ని పొందాలనే నిబంధన కూడా  విధించారు. వైట్‌ హౌస్‌ తన తాజా ఆదేశాల్లో ఈ విషయాన్ని తెలిపింది. హెల్త్‌కేర్‌ కోసం పెట్టుబడి పెట్టలేనివారికి తమ దేశంలో స్థానం లేదని ట్రంప్‌ స్పష్టం చేశారు. నవంబర్‌ 3 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని, చట్టబద్ధంగా దేశంలోకి ప్రవేశించేవారికి ఈ ఆదేశాల నుండి సడలింపు ఉంటుందన్నారు. 2020 ఆర్థిక సంవత్సరంలో 18వేల మంది శరణార్థులకు దేశంలో ఉండేందుకు అనుమతిస్తామని ట్రంప్‌ ప్రభుత్వం చెప్పింది. మోడ్రన్‌ రెఫ్యూజీ ప్రోగ్రామ్‌ ప్రారంభమైన తర్వాత అమెరికాలో ఓకే ఏడాదిలో వలసదారుల సంఖ్య ఇంత తక్కువకు కుదించడం ఇదే మొదటిసారి.