అవాక్కయ్యారా.. : కాంట్రాక్ట్ పోలీసులా.. మహారాష్ట్రలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్

అవాక్కయ్యారా.. : కాంట్రాక్ట్ పోలీసులా..  మహారాష్ట్రలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్

కాంట్రాక్ట్ ఉద్యోగం తెలుసు.. హోంగార్డ్ చూస్తున్నాం.. కాంట్రాక్ట్ లేబర్ చూశాం.. ఇప్పుడు కాంట్రాక్ట్ పోలీస్ ఉద్యోగం.. అవును మీరు వింటున్నది అక్షరాల నిజం.. తాత్కాలిక పద్దతిలో.. కాంట్రాక్ట్ కింద సిబ్బందిని నియమించుకుని.. వారితో పోలీస్ బాధ్యతలు నిర్వహిస్తుంది మహారాష్ట్ర ప్రభుత్వం. దీని కోసం సంవత్సరానికి ఏకంగా వంద కోట్ల రూపాయలు చెల్లిస్తుంది.. ప్రతి నెలా 9 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ పోలీసులకు జీతాలు ఇస్తుంది.. ఇప్పుడు ఈ విషయం మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.

ముంబై పోలీసులతో మహారాష్ట్ర స్టేట్ సెక్యూరిటీ కార్పొరేషన్ (MSSC) నుంచి 3వేల మంది సిబ్బందిని నియమించడానికి నెలకు రూ. 8.35 కోట్ల నుంచి ఏటా రూ. 100 కోట్లు చెల్లించాలని మహారాష్ట్ర హోం శాఖ అక్టోబర్ 11న ఉత్తర్వులు జారీ చేసింది. 11 నెలలపాటు కాంట్రాక్టు ప్రాతిపదికన 3వేల మంది సిబ్బందిని నియమించుకునేందుకు ఆమోదం తెలుపుతూ రాష్ట్రం జూలై 27న ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసు బలగాల్లో 40వేల 623 మంది మంజూరయ్యారు. అందులో 10వేల కానిస్టేబుల్స్, డ్రైవర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బలగాలకు ఇంత పెద్ద కొరత ఏర్పడడం ఇదే తొలిసారి.

ALSO READ: హైదరాబాద్‌-సింగపూర్‌ మధ్య మరిన్ని సర్వీసులు

గతంలో, ముంబై పోలీసులు MSSC లేదా హోంగార్డుల సేవలను తీసుకున్నప్పటికీ, అది కొన్ని రోజులు లేదా వారాలకు మాత్రమే పరిమతమయ్యేది. సిబ్బంది కొరత కారణంగా దాదాపు ఒక సంవత్సరం పాటు అదనపు బలగాలను వెతకవలసి రావడం ఇదే మొదటిసారి. కొవిడ్ మహమ్మారి గతంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు ప్రస్తుత పరిస్థితికి దారితీశాయని అధికారులు చెబుతున్నారు. అయితే, కొవిడ్ మహమ్మారి కారణంగా, 2019, 2020, 2021లో నియామకాలు జరగలేదు. మూడేళ్లలో దాదాపు 5వేల మంది సిబ్బంది పదవీ విరమణ చేసినప్పటికీ, ఆ ఖాళీలను భర్తీ చేయలేదని ఒక అధికారి తెలిపారు.