కమీషన్లు తీసుకునే ఆ ఎమ్మెల్యేకు దేవుడూ తెలియదు,దెయ్యమూ తెలియదు

కమీషన్లు తీసుకునే ఆ ఎమ్మెల్యేకు దేవుడూ తెలియదు,దెయ్యమూ తెలియదు

హైదరాబాద్: రామాలయ నిర్మాణం పై టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అడ్డగోలుగా మాట్లాడుతుంటే సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించరని ప్ర‌శ్నించారు బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ. ప్రగతి భవన్ నుంచి ఆదేశాల తోనే రాముడి గుడి నిర్మాణం పై మంత్రులు, ఎమ్మెల్యే లు మాట్లాడుతున్నారా..?? రాముడి పై ఆ విధంగా మాట్లడమనే కెసిఆర్ చెబుతున్నారా? అంటూ ఆమె మండిప‌డ్డారు.

అయోధ్యలో రాముడి గుడి నిర్మాణం లో దేశ ప్రజందరికీ శ్రీరామ జన్మ భూమి తీర్థ క్షేత్రం భాగస్వామ్యాన్ని చేయాలనుకుందని, అందులో భాగంగా నే నిధి సేకరణ చేస్తుంద‌ని ఆమె అన్నారు. పచ్చ కామెర్లు వచ్చినోడికి ఊరంతా పచ్చగానే కనిపించినట్లుగా ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి మాటలున్నాయ‌ని, కాంట్రాక్టర్ ల వద్ద కమీషన్ లు తీసుకొనే ఆ ఎమ్మెల్యే కు దేవుడూ తెలియదు దెయ్యమూ తెలవదని అన్నారు. రాముడు పేరుతో బీజెపి వసూలు చేస్తున్నార‌న్న ధ‌ర్మారెడ్డి ఆరోప‌ణ‌లు శ్రీ రాముడిని అవమానించేలా మాట్లాడుతున్నార‌న్నారు. నిధి సేకరణ గొప్పగా సాగుతుందనీ TRS నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని ఆమె అన్నారు.

నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బ‌డ్జెట్ గురించి మాట్లాడుతూ.. విద్యా, వ్యవసాయ రంగానికి కేంద్ర బడ్జెట్ లో ప్రాధానత్య ఇచ్చిందన్నారు. రైతు మద్దతు ధర కోసం లక్ష 75 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో పెట్టిందని చెప్పారు. .తెలంగాణకు నిధులు తగ్గించాలని 15వ ఆర్థిక సంఘం చెప్పినా మోదీ ప్రభుత్వం ఎక్కువ నిధులిచ్చిందని, గతంలో మాదిరిగానే కేంద్రం రాష్ట్ర వాటా ను ప్రకటించిందని తెలిపారు.