2వేల మంది ఎంపీలు కావాలి!

2వేల మంది ఎంపీలు కావాలి!

దేశంలో 1951–52 సాధారణ ఎన్నికలప్పుడు జనాభా 36 కోట్లు . లోక్‌ సభ సీట్లు 489. తర్వాత1971లో  నియోజకవర్గాల పునర్విభజన జరిగింది.  సీట్ల సంఖ్య 545కు పెరిగింది. అప్పుడు జనాభా 54  కోట్లు . ఆ తర్వాత మళ్లీ పునర్విభజన జరగలేదు. 2026 వరకు జరగదు కూడా..! కానీ జనాభా మాత్రం పెరుగుతూనే ఉంది. ఇప్పుడు దేశ జనాభా దాదాపు 135 కోట్లు . ఓటర్లు 90 కోట్లు . అంటే ఒక్కో ఎంపీ తొలిసారి ఎన్నికలు జరిగినప్పటి ఓటర్ల సంఖ్య కన్నానాలుగు రెట్ లు ఎక్కు వ మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి పంచ సగటు, జనాభా ప్రకారం మనకు 2,000 మంది ఎంపీలు కావాలా?

 2026 వరకు వాయిదా

రాజ్యాం గంలోని ఆర్టికల్‌‌‌‌ 81 ప్రకారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని జనాభా, లోక్‌ సభ సీట్ల నిష్పత్తి దేశమంతటా ఒకేలా ఉండాలి. 1976 ఎమర్జెన్సీ సమయంలో లోక్‌ సభ సీట్ల సంఖ్యకు మరో 25 ఏళ్లపాటు 1971 జనాభా లెక్కలనే పరిగణనలోకి తీసుకోవాలని 42వ రాజ్యాంగ సవరణచేశారు.ఎందుకంటే అప్పట్లో కుటుంబ నియంత్రణ కార్యక్రమం అమలవుతోంది.  కానీ 2001లో 84వ రాజ్యాంగ సవరణ చేసి జకవర్గాల పునర్విభజనను 2026 వరకు వాయిదా వేశారు. ఇప్పుడు జనాభా ప్రకారం పునర్విభజన జరిగితే లోక్‌ సభ సీట్ల సంఖ్య పూర్తిగా మారుతుంది. ఉత్తరప్రదేశ్‌ , బీహార్‌‌‌‌, మధ్యప్రదేశ్‌ ,మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలకు సీట్లు బాగా పెరుగుతాయి. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ , ఒడిశా,తెలంగాణ సీట్లు తగ్గుతాయి. లోక్‌ సభ సీట్ల  ఖ్యను పెంచకుండా వాయిదా వేస్తుండటంతో ‘వన్‌ మ్యాన్‌ వన్‌ వోట్‌‌‌‌’ సూత్రం నీరుగారిపోతోంది. 1971లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినపుడు పెద్ద రాష్ట్రాల్లో ఒక్కో లోక్‌ సభ నియోజకవర్గాని కి ఓటర్లు 10 లక్షల నుంచి 10.6 లక్షల వరకు ఉన్నారు. ఈ 40 ఏళ్లలో సీట్ల సంఖ్య మారలేదుగానీ ఓటర్లు పెరిగారు. 2016 జనాభానే ప్రాతిపదికగా తీసుకుంటే రాజస్థాన్‌ లో ఒక్కో ఎంపీ 30 లక్షల మందికి ప్రాతినిధ్యం  హిస్తున్నాడు. అదే తమిళనాడులో ఈ సంఖ్య 18 లక్షలు కేంద్రపాలిత ప్రాంతం నుంచి కనీసం ఒక్కరైన ప్రాతినిధ్యం వహించాలని నిబంధన ఉంది. 2008లో సీట్లను పెంచకుండా జనాభాను విభజించారు.దానికి ముందు ఒకే రాష్ట్రం లోని ఓటర్ల ‘వోట్‌‌‌‌ వెయిట్‌‌‌‌’పూర్తిగా వేరుగా ఉండేది. దీని కి మంచి ఉదాహరణ ఢిల్లీనే. చాందినీచౌక్‌ లో ఓటర్లు 3.4 లక్షలుంటే ఔటర్‌‌‌‌ ఢిల్లీ ఓటర్లు 33.7 లక్షలు. 2014లోనూ ఇలాంటి పరిస్థితే . దేశంలోని ఐదు చిన్న నియోజకవర్గాల మొత్తం జనాభా కలిపినా 8 లక్షలు దాటలేదు. అదే ఐదు పెద్ద

నియోజకవర్గాల ఓటర్ల సంఖ్య 1.2 కోట్లు

జనాభా ప్రకారం లోక్ సభ సీట్లు కేటాయిస్తే

సీట్లు పెరిగే పెద్ద రాష్ట్రాలు

రాష్ట్రం              ఉన్నది         ఉండాల్సింది             2071లో

ఉత్తరప్రదేశ్‌          80              93                       109

బీహార్‌               40              44                         58

రాజస్థా న్‌‌‌‌           25              31                         38

మధ్యప్రదేశ్‌         29              33                         35

మహారాష్ట్ర          48               51                        48

సీట్లు తగ్గే పెద్ద రాష్ట్రాలు

కర్నాటక           28               26                         23

ఒడిశా               21              18                         15

పశ్చిమబెంగాల్‌‌‌‌   42               40                        32

కేరళ                 20               15                        12

ఏపీ, తెలంగాణ     42              37                        31

తమిళనాడు        39              29                        23

2014లో అతిపెద్ద నియోజకవర్గాలు

(జనాభా ప్రకారం)

మల్కాజ్‌‌‌‌గిరి  31.8 లక్షలు

బెంగళూరు నార్త్‌‌‌‌ 24 లక్షలు

ఘజియాబాద్‌‌‌‌ 23.6 లక్షలు

నార్త్‌‌‌‌ వెస్ట్‌‌‌‌ ఢిల్లీ 21.9 లక్షలు

బెంగళూరు రూరల్‌‌‌‌_21.9 లక్షలు

అతి చిన్న నియోజకవర్గాలు

లక్ష్యద్వీప్‌‌‌‌     49 వేలు

డామన్‌‌‌‌ అండ్‌ డయ్యూ  1.1 లక్షలు

లడాక్‌‌‌‌   1.6 లక్షలు

దాద్రానగర్‌‌‌‌ హవేలీ   1.9 లక్షలు

అండమాన్‌‌‌‌ నికోబార్‌‌‌‌   2.69 లక్షలు

2026 లో జరుగుతుందా?

ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంపీ, వోటర్‌‌‌‌ నిష్పత్తిలో ఇండియానే టాప్‌‌‌‌. దేశంలోని 543 మంది ఎంపీలు ఒక్కొక్కరు సగటున 15 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదే ప్రపంచవ్యాప్తంగా 1.45 లక్షలే. జనాభా పెరగడంతో ఓటర్ల సంఖ్య పెరిగిన మాట నిజమే. కానీ అదే ప్రకారం లోక్‌ సభ సీట్లు పెరగలేదు.1977 నుంచి సీట్లలో ఏ మార్పు లేదు. అందుకే తొలి ఎన్నికలు జరిగిన నాటితో పోలిస్తే నాలుగురెట్ లు ఎక్కు వ మంది ఓటర్లకు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి వన్‌ మ్యాన్‌ వన్‌ వోట్‌‌‌‌ సూత్రానికి 2026లో పూర్వవైభం వస్తుందా? ఏమో.. జనాభాను తగ్గించేం దుకు దక్షిణాది రాష్ట్రాలు, పశ్చి మ బెంగాల్‌‌‌‌ ఎన్నో చర్యలు తీసుకు న్నాయి. అలాంటి రాష్ట్రాలు నష్టపోయే అవకాశం ఉంది.