ప్రధాని మోడీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు: రాహుల్

ప్రధాని మోడీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు: రాహుల్

న్యూఢిల్లీ: లడఖ్‌లోని గాల్వాన్ వ్యాలీలో మంగళవారం చైనా ఆర్మీతో జరిగిన ఘర్షణలో 20 మంది ఇండియా జవాన్లు వీర మరణం పొందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

‘ప్రధాని మోడీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఆయన ఎందుకు దాక్కుంటున్నారు? అసలేం జరిగిందో అందరికీ తెలియాలి. మన సైనికులను చంపడానికి చైనాకు ఎంత ధైర్యం? మన భూభాగాన్ని ఆక్రమించడానికి వారికి ఎంత తెగింపు?’ అని రాహుల్ ట్వీట్ చేశారు. ధైర్య సాహసాలు కలిగిన 20 మంది మన సైనికులు చనిపోవడం షాక్‌కు గురి చేసిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ విచారం వ్యక్తం చేశారు. దీనిపై మోడీ తప్పక స్పందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.