
హైదరాబాద్, వెలుగు : టీఎస్పీఎస్సీ క్వశ్చన్పేపర్స్లీకేజ్ లో సీఎం పాత్ర ఉందని, ఆయన ప్రమేయం లేకుండా జరగదని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు. వరుసగా రెండో రోజూ 10వ తరగతి పేపర్లు లీక్ కావటం బాధాకరమన్నారు. ఆదిలాబాద్ లో ఆన్సర్ షీట్స్ మాయం అయ్యాయన్నారు. లీకేజ్ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. మంగళవారం బీజేపీ స్టేట్ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో పబ్లిక్, స్టూడెంట్స్, నిరుద్యోగులను పేపర్ లీకేజ్ అంశం ఆందోళన గురిచేస్తోందన్నారు. తెలంగాణ ప్రజల్ని, నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అధికారులకు జవాబుదారీ తనం లేదని, ఎడ్యుకేషన్ మంత్రి చదువురాని తల్లి అని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే కేసీఆర్ దేశానికి ప్రధాని అయినట్లు కలలు కంటున్నారన్నారు.
పేపర్ లీకేజ్ లో తన పీఏ పాత్ర లేదని కేటీఆర్ అన్నారని, కానీ, సిట్ ఆఫీసర్లు మాత్రం మల్యాల మండలం వెళ్లి వర్క్ ఫ్రం హోం లాగా ఎంక్వైరీ చేస్తున్నారన్నారు. మిగతా అందరినీ సిట్ ఆఫీసుకు పిలిచి వీరిని మాత్రం వాళ్ల ఇంట్లో విచారణ చేయటం ఏంటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే తెలంగాణ సమాజం, అమరవీరుల ఆత్మ ఘోషిస్తోందన్నారు. పేపర్ లీక్ లో బీజేపీ కార్యకర్తలను బద్నాం చేస్తున్నారని నర్సయ్య గౌడ్ ఫైర్ అయ్యారు.