70 ఏళ్లుగా మహానటులు ఎన్టీఆర్, ఏన్నారైలకు కూడా జాతీయ అవార్డు రాలేదా? ఎందుకు?

70 ఏళ్లుగా మహానటులు ఎన్టీఆర్, ఏన్నారైలకు కూడా  జాతీయ అవార్డు రాలేదా? ఎందుకు?

తెలుగు హీరోలకు జాతీయ అవార్డులు రావా.. మన తెలుగు హీరోలు జాతీయ ఉత్తమ నటులు కారా.. 70 ఏళ్లుగా ఉన్న ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికేసింది. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఆ ఘనతను సాధించాడు. పుష్ప సినిమాలో తగ్గేదేలే అని ఏ ముహూర్తాన డైలాగ్ చెప్పాడో తెలియదు కానీ.. అందుకు తగ్గట్టుగానే పుష్ప మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇప్పుడు జాతీయ ఉత్తమ నటుడి కిరీటాన్ని అల్లు అర్జున్ కి కట్టబెట్టింది.

అయితే ఈ విషయంలో నేటి తరం యువత మాత్రం కాస్త కన్ఫ్యూజన్ లో ఉన్నారు. తెలుగు సినిమా హీరోకి 70 ఏళ్ళ తరువాత ఇప్పుడు జాతీయ ఉత్తమ నటుడిగా మొదటి సారి అవార్డు రావడం ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఆ సందేహం నిజమే. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది గొప్ప నటీనటులు ఉన్నారు. అంతకన్నా గొప్ప సినిమాలు కూడా వచ్చాయి. మరి వాటికి రాకపోవడం ఏంటి? పౌరాణిక, జానపద, కుటుంబ కథ చిత్రాలు చేయడంలో మానవాళ్ళు దిట్ట. అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్న ఈ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఒక్క అవార్డు కూడా రాకపోవడం ఏంటి అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.   

సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణ, శోభన్ బాబు, కృషంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఇలా చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు. మాయాబజార్, మిస్సమ్మ, గులెబకావాలి కథ, గుండమ్మ కథ, దేవదాసు, భక్త కన్నప్ప, లవకుశ, బొబ్బిలి బ్రహ్మన్న, స్వయం కృషి, ఆపద్బాంధవుడు, రుద్రవీణ, సిరివెన్నెల, అన్నమయ్య ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు. కానీ ఈ ఆణిముత్యాల్లో ఒక సినిమాకు కూడా బెస్ట్ యాక్టర్ గా జాతీయ పురస్కారం అందుకోలేదు. 

అన్నమయ్య సినిమాకు ఖచ్చితంగా నాగార్జున కు జాతీయ అవార్డు వస్తుంది అనుకున్నారంతా. వెంకటేశ్వర్ స్వామి భక్తుడు నాగార్జున నటన అజరామరం. సాక్షాత్తు ఆ అన్నమయ్యే వచ్చి నటించారా అనే స్థాయిలో అద్భుతమైన నటనను కనబరిచారు నాగార్జున. అయినా కూడా  ఆయనకు అవార్డు రాలేదు. కేవలం అన్నమయ్య సినిమాను మాత్రమే వచ్చింది. ఇక అప్పటినుండి తెలుగు సినిమాలకు బెస్ట్ యాక్టర్ గా జాతీయ అవార్డు రావడం కష్టమే అని ఫిక్స్ ఐపోయారంతా. కానీ ఆ  అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు అల్లు అర్జున్.    

నిజానికి పుష్ప సినిమా ఇప్పుడు మన చెప్పుకున్న సినిమాల కన్నా గొప్ప సినిమా ఎం కాదు. కానీ ఆ సినిమాలో అల్లు అర్జున్ నటన అద్భుతంగా ఉంటుంది. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ యాక్ట్ చేశారు అనే కంటే జీవించాడు అనడం కరెక్ట్. అంతేకాదు ఈ సినిమాలో అయన నటన, డైలాగ్ డెలివరీ, డాన్స్ కు ఆడియన్స్ ఫిదా ఇపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసిన పుష్ప మ్యానియానే కనిపించింది. అంతలా తన యాటిట్యూడ్ తో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేశాడు బన్నీ. ఇక పుష్ప సినిమాకు అల్లు అర్జున్ ఈ అవార్డు అందుకోవడం పట్ల ఎవరు ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే ఆయనకు నటనకు అది రావాల్సిందే అని కామెంట్స్ చేస్తున్నారు.