
టాలీవుడ్ ను ఒక ఊపు ఊపిన హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. అలాంటి బుట్టబొమ్మను గుంటూరు కారం సినిమా నుంచి ఎందుకు తప్పించారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కెరీర్ ఆరంభంలో వరుస ఫ్లాపులను చవిచూసింది ఈ అమ్మడు. దువ్వాడ జగన్నాథం సినిమా సక్సెస్‌తో కెరీర్ గ్రాఫ్‌ను రివ్వున ఎగిరేలా చేసింది. ఆ తర్వాత వచ్చిన అరవింద సమేత, మహర్షి, గద్దలకొండ గణేష్, అలా వైకుంఠపురం, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ తదితర సినిమాలు ఆమెను స్టార్ హీరోయిన్‌గా మార్చేశాయి. ప్రభాస్ తో కలిసి నటించిన రాధేశ్యామ్, తమిళ స్టార్ విజయ్ తో నటిచిన బీస్ట్, చిరంజీవిచ రాంచరణ్ తో కలిసి చేసిన ఆచార్య డిజాస్టర్ గా మారడంతో ఆమె వైపు చూసేందుకు హీరోలు భయపడ్డారు.
సరిగ్గా ఈ సమయంలో మహేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో పూజాహెగ్డే హీరోయిన్ గా ఓ సినిమా ప్రారంభమైంది. ఆ సినిమా షూటింగ్ దాదాపు 30 రోజులపాటు జరిగిందట. ఆ సినిమా కథ నచ్చకపోవడంతో మరో స్టోరి చేద్దామని త్రివిక్రమ్, మహేష్ ఓ నిర్ణయానికి వచ్చారు. 30 రోజుల షూటింగ్‌ను చెత్తబుట్లలో వేసి మరో కథను ట్రాక్‌పైకి తెచ్చారు. అదే గుంటూరు కారంగా మారింది. కథ మారడంతో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కూడా మారిపోవడంతో పూజా హెగ్డేను గుంటూరు కారం సినిమా నుంచి తప్పించారు. అప్పటి వరకు సెకండ్ హీరోయిన్‌గా ఉన్న శ్రీలీలను మెయిన్ హీరోయిన్‌గా మారిపోయింది. సెకండ్ హీరోయిన్ స్థానంలో మీనాక్షి చౌదరీని తీసుకోవడం చకచకా జరిగిపోయాయి.