న్యాయం చేయనప్పుడు కొనసాగడం ఎందుకు? : సురేష్ రైనా

న్యాయం చేయనప్పుడు కొనసాగడం ఎందుకు? : సురేష్ రైనా

న్యూఢిల్లీ: ఆటకు సరైన న్యాయం చేయలేనప్పుడు కొనసాగడం వేస్టేనని తన రిటైర్మెంట్​పై సురేశ్​ రైనా వివరణ ఇచ్చాడు. కొన్ని డెకేడ్స్​గా క్రికెట్​ తన నరనరాల్లో ప్రవహించిందన్నాడు. ‘నేను చాలా చిన్న ఏజ్​లో ఉన్నప్పుడు ప్రతి గల్లీలో క్రికెట్​ ఆడేవాడ్ని. అలా పె రుగుతూ పెద్దవాడి నై టీమిండియాలోకి వచ్చా. క్రికెట్​ అంటే నాకు ఎంత ఇష్టమో చెప్పలేను. ఆట కోసం చాలా చేశా. నా నరనరాల్లో క్రికెట్​ ప్రవాహించేది. ఆట లేకుండా ఒక్క రోజు కూడా ఉండలేదు. నాకు అన్నీ ఇచ్చిన దేవుడు, అభిమానులకు చాలా ధన్యవాదాలు. ఆట కోసం అన్ని చేశా. నాకు చాలా సర్జరీలు జరిగాయి. ఎన్నో ఎత్తు పల్లాలు చూశా. వా టన్నిం టినీ తట్టు కుని తిరిగి టీమ్​లోకి రాలే నని తెలుసు. అలా న్యాయం చేయలేనప్పుడు వదిలేయడమే ముఖ్యమని భావించా ’ అని రైనా పేర్కొన్నాడు. తన జర్నీలో మద్దతిచ్చిన ఫ్యామిలీ, కోచ్​లు, ఫి జీషియన్స్​, ట్రెయినర్స్​, టీమ్​మేట్స్​, ఫ్యాన్స్​.. ఇలా ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలన్నాడు. తన కోచ్​లు ఎల్లప్పుడూ తనను సరైన దారిలో నడిపించడం వల్లే ఈ జర్నీ సాధ్యమైందన్నాడు.