ఫ్లైట్‌ జర్నీలో ఈ 5వస్తువులు తీసుకెళ్లొద్దు

ఫ్లైట్‌ జర్నీలో ఈ 5వస్తువులు తీసుకెళ్లొద్దు

ఇప్పుడిప్పుడే విమాన ప్రయాణం అందిరికీ చేరువలోకి వస్తోంది. ఫారన్ కంట్రీస్ కాకున్నా.. దేశం లోపలే ఇతర రాష్ట్రాలకు, ప్రాంతాలకు వెళ్లడానికి ఫ్లైట్ బుక్ చేసుకుంటున్నారు. అయితే.. చాలామందికి ఫ్లైట్ లో ప్రయాణించేటప్పుడు ఏ వస్తువులు తీసుకెళ్లాలో, ఏయే వస్తువులు తీసుకెళ్లకూడదో తెలియదు. విమాన ప్రయాణం చేసేటప్పుడు కొన్ని నిషేదిత వస్తువులు ఉంటాయి. వాటిని ఎయిర్ పోర్ట్ సిబ్బంది లోపలికి అల్లో చేయరు. వీటిలో రెండు రకాలు ఉంటాయి. క్యారీ ఆన్ అంటే వాటిని భద్రంగా ప్యాక్ చేసిన ట్రాన్స్‌పోర్ట్ చేయవచ్చు. చెక్డ్ లగేజీ ఇవి ఎయిర్ పోర్ట్ లోనికే అనుమతించరు. వీటి గురించి ఎయిర్ పోర్ట్ సిబ్బంది ముందే టికెట్ బుక్ చేసుకునే ముందే తెలియజేస్తారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

హై కెపాసిటీ పవర్ బ్యాంక్

విమానాశ్రయంలోకి 2000 mah కంటె ఎక్కువ కెపాసిటీ ఉన్న పవర్ బ్యాంక్స్ ఎయిర్ పోర్ట్‌లోనికే అనుమతించరు. ఎందుకంటే బ్యాటరీలో అయాన్, లిథియం ఉంటాయి. వీటి వల్ల ఫైర్ యాక్సిడెంట్స్ జరగొచ్చు.

పోర్టబుల్ వైఫై, హట్‌స్పాట్

ఫ్లైట్ కు అందించే సిగ్నల్స్ కు పోర్టబుల్ వైఫై, హాట్ స్పాట్ డివైజ్ లు అడ్డంకులు కలిగిస్తాయి. ఏయిర్ పోర్ట్ లోని వైర్ లెస్ కనెక్టివిటీకి, నావిగేషన్ సిస్టమ్ కు ఇవి అవరోదాలు కలిగిస్తాయి. అందుకే వీటిని ఫ్లైట్ జర్నీలో తీసుకెళ్లనివ్వరు. ఏయిర్ పోర్ట్ లోపలికి వెళ్లగానే ఫ్రీ Wi Fi ఇస్తారు. అవసరం అనుకుంటే ఆ నెట్ వర్క్ వాడుకోవచ్చు.

రిమోట్ కంట్రోల్ బొమ్మలు, డ్రోన్లు

రిమోట్ కంట్రోల్ టాయ్స్, వెర్ లెస్ సిగ్నిల్స్ తో పనిచేసే డోన్స్ విమానాశ్రయ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తాయి. అందుకే వీటిని ఏయిర్ పోర్ట్ లోనికి అనుమతించరు.

లేజర్ లైట్స్, ఇంక్ పెన్నులు

ఇవి ఏయిర్ పోర్ట్ సైట్ లో వాడటం నిషేదం. పైలట్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, ఇతర ఎయిర్ పోర్ట్ సిబ్బంది కంటి చూపు పోవడానికి కారణం అవుతాయి. లేజర్ లైట్స్, పెన్నులు ఎయిర్ పోర్టు చుట్టుపక్కలో వాడకూడదు. ఇంక్ పెన్నులు ఫ్లైట్ నడిచే వాతావరణంలో ఖరాబ్ అవుతాయి. దానికి బదులు పెన్సిల్ తీసుకెళ్లొచ్చు.

 ఈ-సిగరెట్లు, వాపింగ్ పరికరాలు

ఎలక్ట్రానిక్ సిగరెట్లు కేవలం క్యారీ ఆన్ లిస్ట్ లోనే ఉంటాయి. ఇవి ఏయిర్ పోర్ట్, ఫ్లైట్ లో వాడటానికి అనుమతి లేదు. జాగ్రత్తగా ప్యాక్ చేసి మాత్రమే వాటిని విమానంలో తీసుకెళ్లవచ్చు.