మేడ్​ ఫర్​ ఈచ్​ అదర్​..గ్రూప్2 విన్నర్స్

మేడ్​ ఫర్​ ఈచ్​ అదర్​..గ్రూప్2 విన్నర్స్

కోచింగ్‌‌లో పరిచయం.. పరిణయంగా మారింది.

చెరో సర్కారు కొలువు చేస్తూనే.. డిస్కషన్..  ప్రిపరేషన్

ఇప్పుడీ భార్యాభర్తలు గ్రూప్​ 2 జాబ్​కు సెలెక్టయ్యారు.

కోచింగ్‌‌లో పరిచయం.. ఆ తర్వాత పెళ్లి.. ఇప్పుడు ఇద్దరికీ గ్రూప్‌‌–2 జాబ్‌‌లు..  నల్ల త్రినాథ్‌‌రెడ్డి, సుజాతల సక్సెస్ స్టోరీ.  కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం  మొలంగూరు శివారు నల్ల వెంకయ్యపల్లి  గ్రామానికి చెందిన  త్రినాథ్‍ రెడ్డి 2011 లో బీటెక్ పూర్తవగానే  హైదరాబాద్ లో ఏడాది పాటు కాల్ సెంటర్ లో జాబ్ చేశారు. సర్కారు కొలువులకు ప్రిపేరవడానికి టైం సరిపోవట్లేదని జాబ్ మానేసి హన్మకొండలో ‌‌ కోచింగ్ తీసుకున్నారు. ఆ టైంలోనే జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన సుజాత పరిచయమయ్యారు. ఇద్దరు కలిసి ప్రిపరేషన్​. రోజూ  గ్రూప్ డిస్కషన్ చేసేవారు. వెంటవెంటనే త్రినాథ్‌‌ వీఆర్‌‌‌‌వో, పంచాయతీ సెక్రటరీ, ఫారెస్ట్‌‌ బీట్ ఆఫీసర్, గ్రూప్‌‌–4 ఉద్యోగాలకు సెలెక్టయ్యాడు. సుజాత వీఆర్‌‌‌‌వో, పంచాయతీ సెక్రటరీ కొలువులు కొట్టింది. పంచాయతీ సెక్రటరీగా చేస్తున్న త్రినాథ్ గ్రూప్​ 2 లో డిప్యూటీ తహసీల్దార్‌‌‌‌గా సెలెక్టయ్యాడు. సుజాతకు అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ జాబ్​ వచ్చింది.  భార్యభర్తలిద్దరూ తమ  తదుపరి లక్ష్యం గ్రూప్‌‌–1 కొట్టడమే అంటున్నారు. అంతేకాదు వీరితోపాటు కలిసి  ప్రిపేరైన బంధువు పొద్దుటూరి అంజలి సైతం గ్రూప్‌‌–2 ఫలితాల్లో కొలువు దక్కించుకున్నారు.

– కరీంనగర్, వెలుగు