భర్త వివాహేతర సంబంధం: రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని చితకబాదిన భార్య

V6 Velugu Posted on Mar 04, 2021

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను పట్టుకొని చితకబాదింది ఓ మహిళ. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో జరిగింది. గాజులరాజాం బస్తీలో కేబుల్ ఆపరేటర్ గా పనిచేస్తున్న రాజు… అదే ఏరియాలో ఉండే యువతితో కొన్ని నెలలుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అనుమానం వచ్చి భార్య ప్రశ్నిస్తే ఏం లేదని రాజు బుకాయించే వాడు. ఇవాళ భర్త రాజు యువతి ఇంటికి వెళ్లిన విషయాన్ని గమనించింది అతని భార్య. బంధువులతో కలిసి యువతి ఇంటికి వెళ్లి భర్తను పట్టుకొని ఇద్దరిని చితకబాదింది. పోలీసులు రాజుతో పాటు యువతిని స్టేషన్ కు తరలించారు.

Tagged attack, Wife, Bhadradri Kothagudem District, extra marital affair

Latest Videos

Subscribe Now

More News