సీఎం ఇంట కరోనా తంటా.. భార్యాపిల్లలతో సహా 15 మందికి పాజిటివ్

సీఎం ఇంట కరోనా తంటా.. భార్యాపిల్లలతో సహా 15 మందికి పాజిటివ్

కరోనా కేసులు మళ్లీ విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా జార్ఖండ్ సీఎం హేమంట్ సొరేన్ ఇంట్లో కరోనా కలకలం రేగింది. ఆయన భార్యతోపాటు ఇద్దరు పిల్లలు సహా మొత్తం 15 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా.. ఈ కరోనా పరీక్షల్లో సీఎం హేమంత్ సొరేన్‌కు నెగిటివ్‌గా తేలినట్లు రాంచీ మెడికల్ ఆఫీసర్ వినోద్ కుమార్ తెలిపారు. సీఎం నివాసంలో ఇప్పటివరకు 62 మందికి కోవిడ్ -19 పరీక్షలు చేసినట్లు రాంచీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వినోద్ కుమార్ తెలిపారు. వారిలో 24 మంది రిపోర్టులు శనివారం సాయంత్రం వచ్చాయి. అందులో  సీఎం భార్య కల్పనా సోరెన్, వారి ఇద్దరు కుమారులు నితిన్, విశ్వజిత్, మరదలు సరళా ముర్ము, ఆయన బాడీ గార్డ్ సహా 15 మందికి పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. వారందరికీ స్వల్ప లక్షణాలు ఉండటంతో.. ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్‎లో ఉంచారు. 

మరోవైపు జార్ఖండ్ ఆరోగ్య మంత్రి బన్నా గుప్తా మరోసారి కరోనా బారిన పడ్డారు. ఆయన శనివారం పరీక్షలు చేయించుకోగా.. కరోనా పాజిటివ్‎గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన జంషెడ్‌పూర్‌లోని తన నివాసంలో ఐసోషన్‎లో ఉన్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని గుప్తా సూచించారు. గుప్తా గత ఆగష్టు 2020లో కరోనా బారినపడ్డారు.