న్యూఢిల్లీ: యాపిల్ సీఈఓ టిమ్ కుక్ (65) వచ్చే ఏడాదిలో పదవి నుంచి తప్పుకునే అవకాశం కనిపిస్తోంది. ఆయన 2011లో స్టీవ్ జాబ్స్ మరణం తర్వాత బాధ్యతలు చేపట్టారు. 14 ఏళ్లపాటు కంపెనీని నడిపించారు. యాపిల్ కంపెనీలో పనిచేసే వ్యక్తినే కొత్త సీఈఓగా నియమించాలని కుక్ చూస్తున్నారని ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్ట్ పేర్కొంది.
వచ్చే ఏడాది జనవరి తర్వాత, అంటే డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ ప్రకటన తర్వాత కొత్త సీఈఓను ప్రకటించే అవకాశం ఉందని వెల్లడించింది. కంపెనీ హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాన్ టెర్నస్‌ను వారసుడిగా భావిస్తున్నారు. కుక్ నాయకత్వంలో యాపిల్ మార్కెట్ క్యాప్ 350 బిలియన్ డాలర్ల నుంచి 4 ట్రిలియన్ డాలర్లకి పెరిగింది.
షేర్లు ఆల్‌టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. రానున్న క్రిస్మస్ హాలిడే సీజన్‌లోయాపిల్ రెవెన్యూ 10–12శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
