మోడీ కీలక వ్యాఖ్యలు .. త్వరలో ఎంపీ సీట్లు పెరుగుతయ్

మోడీ కీలక వ్యాఖ్యలు ..  త్వరలో ఎంపీ సీట్లు పెరుగుతయ్

కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.  రానున్న రోజుల్లో ఎంపీల సంఖ్య  పెరుగుతాయని అన్నారు. అందుకు తగ్గట్లుగానే అధునిక వసతులతో కొత్త భవానాన్ని నిర్మించామని తెలిపారు. ప్రస్తుత  పార్లమెంట్ కు 1272 మంది సభ్యులు కూర్చునే విధంగా నిర్మించామని వెల్లడించారు. పాత పార్లమెంట్ భవనంలో కూర్చోవడానికే కాకుండా సాకేంతికంగానూ  ఇబ్బంది ఉండేదని మోడీ చెప్పారు.  

భారత్ అభివృద్ధి చెందితే ప్రపంచం కూడా అభివృద్ధి చెందుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.  కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం అనంతరం మోడీ మాట్లాడారు.  కొత్త పార్లమెంట్ ప్రజాస్వామ్యానికి కొత్త దేవాలయామని ఆయన అభిప్రాయపడ్డారు. స్వా్తంత్యం వచ్చిన  75 ఏళ్ల తరువాత కొత్త  పార్లమెంట్ నిర్మించుకున్నామని తెలిపారు.  ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని వెల్లడించారు.  

ఈ భవనంతో 140 కోట్ల భారతీయుల కల సాకారమైందని మోడీ చెప్పారు.  కొత్త పార్లమెంట్ .. కొత్త భారత్ కు కొత్త జోష్ తీసుకువచ్చిందన్నారు.  ఇది కేవలం భవనం మాత్రమే కాదని 140 కోట్ల భారతీయుల ఆకాంక్షకు ప్రతీక అని అభిప్రాయపడ్డారు. అధునిక భారత్ కు కొత్త పార్లమెంట్ అద్దం పడుతోందని చెప్పారు.  పవిత్రమైన సెంగోల్ ను పార్లమెంట్ లో ప్రతిష్టించామని మోడీ చెప్పారు. సేవ కర్తవ్యానికి సెంగోల్  ప్రతీక అని వెల్లడించారు.  చోళ సామ్రాజ్య  చరిత్రలో సెంగోల్ కు ప్రత్యేకమైన స్థానం ఉందని వెల్లడించారు.