బ్యాండ్ కళాకారుల సమస్యలను సర్కార్ దృష్టికి తీసుకెళ్తా: వెన్నెల

బ్యాండ్ కళాకారుల సమస్యలను సర్కార్ దృష్టికి తీసుకెళ్తా: వెన్నెల

హనుమకొండ, వెలుగు: బ్యాండ్ వాయిద్యా కళాకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ జీవీ వెన్నెల తెలిపారు. కళాకారుల సంఘం రాష్ట్రస్థాయి సదస్సు బుధవారం హనుమకొండలోని సిటిజన్ ఫంక్షన్ హాల్‎లో నిర్వహించగా.. చీఫ్​గెస్ట్‎గా ఆమె హాజరై మాట్లాడారు. బ్యాండ్ కళాకారుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ఉపాధి రంగాల్లో అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

రాష్ట్రం వచ్చినప్పటినుంచి బ్యాండ్ కళాకారులకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎంవీ. రమణ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బ్యాండ్ వాయిద్య కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గుమ్మడిరాజుల నాగరాజు, వృత్తి సంఘాల హనుమకొండ జిల్లా కన్వీనర్ కాడబోయిన లింగయ్, నేతలు  చాంద్ పాషా, కె.శంకర్ తదితరులు పాల్గొన్నారు.