కుకునూరుపల్లి అభివృద్ధికి సహకరిస్తా: సిద్దిపేట జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి

కుకునూరుపల్లి అభివృద్ధికి సహకరిస్తా: సిద్దిపేట జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి

కొండపాక(కుక్కునూరుపల్లి), వెలుగు: కొత్తగా ఏర్పడిన కుక్కునూరు పల్లి మండల అభివృద్ధికి సహకరిస్తాననని జిల్లా ఇన్‌చార్జి, మైనింగ్‌, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలంలోని బొడ్రాయి ప్రతిష్ట, రేణుక ఎల్లమ్మ వివాహ వార్షికోత్సవానికి హాజరయ్యారు.

మొదటిసారిగా గ్రామానికి వచ్చిన మంత్రిని గ్రామస్తులు శాలువాతో ఘనంగా సన్మానించారు. గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన వారాహి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా స్థానిక నాయకులు మండల అభివృద్ధికి సీసీ, డ్రైనేజీ, పర్యాటక సంబంధించిన నిధులు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరగా.. వాటికి సంబంధించిన పూర్తిస్థాయి నివేదికను వెంటనే అందజేయాలని అధికారులను ఆదేశించారు. 

ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లం కనుకవ్వ, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు గంగాధర్, వెంకటేశ్‌, ప్యాక్స్  డైరెక్టర్ నరసింహచారి, తదితరులు పాల్గొన్నారు.