నేను గ‌డ్డి తింటా : షోయ‌బ్ అక్త‌ర్

నేను గ‌డ్డి తింటా :  షోయ‌బ్ అక్త‌ర్

పాకిస్తాన్ రావ‌ల్పిండి ఎక్స్ ప్రెస్, మాజీ క్రికెట‌ర్ షోయ‌బ్ అక్త‌ర్ మ‌రోసారి త‌న నోటికి ప‌నిచెప్పారు. గ్రౌండ్ లోనే కాదు ప‌బ్లిక్ లో ప్ర‌త్య‌ర్ధుల‌పై యూట్యూబ్ వేదిక‌గా విమ‌ర్శ‌లు చేయ‌డం ఆయ‌న‌కు ప‌రిపాటిగా మారింది. యూట్యూబ్ లో ఏదో ఒక టాపిక్ మాట్లాడుతూ కాక‌రేపే షోయ‌బ్.. తాజాగా ప్ర‌భుత్వం పాకిస్తాన్ సైన్యం ప‌ట్ల చూపిస్తున్న వివ‌క్ష‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అల్లా నాకు అధికారం ఇస్తే త‌ప్పని స‌రిగా పాక్ సైన్యానికి బ‌డ్జెట్ పెంచుతాన‌ని అన్నారు. అందుకోసం గ‌డ్డి తింటాన‌ని స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకవేళ ఆర్మీ బడ్జెట్ 20 శాతంగా ఉంటే.. దాన్ని తాను 60 శాతం చేస్తానని స్పష్టంచేశాడు. తనతో కూర్చుని, చర్చించి కీలక నిర్ణయాలను తీసుకోవాలని ఆర్మీ చీఫ్‌ను కోరతానని వివరించాడు. మనమంతా ఒకరినొకరు విమర్శించుకుంటూ పోతే.. చివరికి మనమే నష్టపోతామని షోయ‌బ్ అక్త‌ర్ వెల్ల‌డించారు.