బీసీ రిజర్వేషన్లపై పోరాటం చేస్తం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బీసీ రిజర్వేషన్లపై పోరాటం చేస్తం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బీసీ రిజర్వేషన్ల అంశంపై నవంబర్ 26 నుండి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని బీఎస్పీ  రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. కోటి సంతకాల సేకరణ చేసి రాష్ట్రపతికి పంపుతామన్న ఆయన... గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అనేక కార్య్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. దేశంలో బీసీ జనాభా 52% అయితే 27% రిజర్వేషన్ ఎలా సరిపోతుంది? అని ప్రశ్నించారు. అగ్రవర్ణాల పేదలు 8% ఉంటే 10% రిజర్వేషన్ల ఇచ్చారన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం బీఎస్పీ పోరాడితే బీజేపీ అప్పట్లో అడ్డుకుందని ఆరోపించారు. బీసీలకు 50%  రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం బీసీ జనగణన చేయాలని కోరారు.

పెరిగిన జనాభాకి అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. తమిళనాడు, జార్ఖండ్ లాగా తెలంగాణలో కూడా రిజర్వేషన్లు పెంచాలన్నారు. ఉన్నత న్యాయస్థానాల్లో  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఖచ్చితంగా కోటా అమలుచేయాలని కోరారు. బీసీ క్రిమిలేయర్ విధానం ఎత్తివేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే అంతా బోగస్ అన్న ఆయన.. సమగ్ర సర్వే ను సీఎం కేసీఆర్ బయట పెట్టాలన్నారు.