- హైదరాబాద్ X రాజస్తాన్.. ఇవాళ (మే 27) ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్
- రా. 7.30 స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో లైవ్
ముల్లాన్‌పూర్ : ఐపీఎల్–19లో ఎలిమినేటర్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. బుధవారం ( 2026 మే 27) జరిగే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. సీజన్ ఆరంభంలో కాస్త నెమ్మదించిన హైదరాబాద్.. సెకండాఫ్‌లో అద్భుతంగా పుంజుకుంది. చివరి ఏడు లీగ్ మ్యాచ్‌లకు రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ అందుబాటులోకి రావడంతో జట్టు రాతే మారిపోయింది. ఆ ఏడు మ్యాచ్‌ల్లో ఐదింటిలో గెలిచి ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది.
లీగ్ దశలో రెండుసార్లు రాజస్తాన్‌ను ఓడించడం కమిన్స్‌సేనకు ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశం. హైదరాబాద్‌కు అభిషేక్ (563), ట్రావిస్ హెడ్ (393), ఇషాన్ కిషన్ (569), హన్రిచ్ క్లాసెన్ (606)లాంటి భారీ హిట్టర్ల అండ ఉంటే.. రాయల్స్ మొత్తం వైభవ్ సూర్యవంశీ (583), యశస్వి జైస్వాల్ (397), ధ్రువ్ జురెల్ (458)పైనే ఎక్కువగా ఆశలు పెట్టుకుంది.
రాయల్స్ బౌలింగ్ భారం మొత్తం ఆర్చర్ (12)పైనే ఉంది. సన్‌రైజర్స్ బౌలర్లు కమిన్స్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, శివాంగ్ కుమార్ చెలరేగితే రాయల్స్‌కు కష్టాలు తప్పవు. ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం.
