వడ్డించే కేసీఆర్ ఉండగా వేరే పార్టీలు గెలిస్తే పనులవుతాయా?

వడ్డించే కేసీఆర్ ఉండగా వేరే పార్టీలు గెలిస్తే పనులవుతాయా?

ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు

సిద్ధిపేట: సొంత మనిషిలాగా అన్నీ వడ్డించే సీఎం కేసీఆర్ ఉండగా.. వేరే పార్టీలు గెలిస్తే పనులవుతాయా ? .. టీఆర్ఎస్ మీటింగుకు వచ్చిన వాళ్లంతా దుబ్బాక వాళ్లే.. బీజేపీ మీటింగులకు కిరాయి.. పరాయి నాయకులు వచ్చారని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు.  మిరిదొడ్డి మండల కేంద్రంలో టీఆర్ఎస్ బహిరంగ సభలో  మంత్రి హరీశ్ రావు  ప్రతిపక్షాలపై తనదైన శైలిలో చురకలు అంటించారు. ఇవి అనుకోకుండా వచ్చిన  ఎన్నికలు..  మాజీ ఎమ్మెల్యే లింగన్న భార్యను గెలిపించాలని హరీష్ రావు కోరారు. వడ్డించే కేసీఆర్ ఉండగా.. వేరే పార్టీలు గెలిస్తే పనులవుతాయా.. ? అన్న మాట ప్రకారం 2016కు ఫించను ఇస్తున్నారు.. రఘునందన్ రావు తండ్రికి కూడా ఫించన్, రైతుబంధు ఇస్తున్నాం..  పార్టీ ఏది అని కూడా చూడకుండా మీకు కూడా లబ్ది ఇవ్వడం లేదా? మాది ఎంత నీతిగల ప్రభుత్వమో ఒక్కసారి  ఆలోచించాలని హరీష్ రావు సూచించారు.

అన్నీ తీసుకుని రఘునందన్ జూఠా మాటలు చెబుతున్నాడు.. సంజీవ్ అనే బీజేపీ కార్యకర్తకు లక్ష ఇస్తానని హామీ ఇచ్చి రఘునందన్ మాట తప్పాడు…  ఓ కార్యకర్తను కూడా కాపాడుకోలేకపోయాడని విమర్శించారు. కన్న కొడుకులు పట్టించుకోకపోయినా కేసీఆర్ పెద్దకొడుకు లెక్క ఆసరా ఫించన్ ఇస్తున్నాడు.. ఎండకాలం వచ్చిందంటే తాగునీటి కష్టాలు మిషన్ భగీరథతో తీర్చిన ఘనత కేసీఆర్ దేనన్నారు. ఆరు నెలల్లో మల్లన్న సాగర్ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి కాళేశ్వరం నీళ్లతో కాళ్లు కడుగుతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పాలనలో ఎండిన పొలాలు, కాలిన మోటార్లు తప్ప ఏం సాధించారని ఓటేస్తారు.. ? కాంగ్రెస్ కు ఓటేస్తే మోరీలో వేసినట్లే.. బీజేపీకి ఎందుకు ఓటేయాలి..? బాయిల కాడా మీటర్లు కావాల్నా..? ఇక్కడిచ్చే తీర్పుతో ఢిల్లీలో మీటర్ల నిర్ణయంపై మార్పు రావాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.

బీజేపోళ్లు మొన్నటిదాకా బీడీ ఫించన్లు 16వందలు మాయే అని చెవుల్లో జూఠా మాటలు చెప్పారు.. గుజరాత్ లో వాళ్లు ఇచ్చే ఫించన్ 4 వందలు మాత్రమే… దీనిపై దుబ్బాక బస్టాండ్ వద్ద చర్చకు రమ్మంటే బండి సంజయ్ ఎందుకు ముఖం చాటేసాడు? ఆడపిల్లల కాన్పులకు కేసీఆర్ కిట్ లో ఆరువేలు మావే అని చెబుతున్న బీజేపీ నేతలు వాళ్లు ఏలుతున్న రాష్ట్రాల్లో ఇస్తున్నారా? ఆరు పైసలు కూడా వాళ్లు ఇవ్వడం లేదని మంత్రి హరీష్ రావు విమర్శించారు. మల్లన్న సాగర్ నిండితే మన బతుకులు పండుతాయ్..  వాళ్లిచ్చే మందు సీసాలకు మన కడుపు నిండదు.. ఇచ్చిన హామీల్లో ఇంకా ఒకటో రెండు ఉన్నాయి. అవి కూడా పూర్తి చేస్తాం.. సొంత స్థలాలు ఉన్నవారికి డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టుకునేందుకు సహాయం అందిస్తాం.. లక్ష రూపాయల రుణమాఫీ చేసి తీరుతాం అని హరీష్ రావు హామీ ఇచ్చారు. కరోనా వల్ల ఆరు వేల కోట్ల భారం పడింది.. కాంగ్రెస్, బీజేపీ వాళ్ల చేతిలో ఏమీ లేదు. జూఠా మాటలు, నన్ను తిట్టడం తప్ప చేసిందేమీ లేదు…  ప్రాణం పోయినా సరే  నేను మాట తప్పను.. మేం చేసిన అభివృద్ధి కనిపించడం లేదా?.. తోడబుట్టిన అక్కలాంటి సుజాతకు అండగా ఉండి దుబ్బాక అభివృద్ధిలో కుడిభుజంలా పనిచేస్తానని హరీష్ రావు చెప్పారు. ప్రజలు ఎవరూ మందు సీసాలకు లొంగొద్దు… బీజేపీ అధికారంలోకి వస్తే ఒక్కొక్కరికి 15 లక్షలు ఎకౌంట్లో వేస్తామన్నారు. 15 రూపాయలు కూడా ఇవ్వలేదు…  ఏడాదికి కోటి ఉద్యోగాలని చెప్పి.. డీ మానిటైజేషన్ తో ఉన్న ఉద్యోగాలు పోగొట్టారు.. దేశాన్ని ఆర్థికంగా దివాళా తీయించారని హరీష్ రావు ఆరోపించారు.