నా పేరు, ఫొటోలను వాడొద్దు 

నా పేరు, ఫొటోలను వాడొద్దు 

సిసౌలీ: ఎలాంటి ఎన్నికల్లోనూ తాను పోటీ చేయబోనని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) లీడర్ రాకేశ్ తికాయత్ తేల్చి చెప్పారు. వివాదాస్పద మూడు సాగు చట్టాలను కేంద్రం ఉపసంహరించుకున్న తర్వాత మద్దతు ధరతోపాటు రైతులపై పెట్టిన కేసులను వెంటనే వెనక్కి తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో తికాయత్ ఉద్యమానికి  స్వస్తి పలికి ఇంటికి చేరారు. నిరసనలను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నామని.. పూర్తిగా బంద్ చేయడం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. అదే సందర్భంలో తన ఫొటోలు, పేరును పోస్టర్లలో వాడొద్దని రాజకీయ పార్టీలను కోరారు.

‘నేను ఎలాంటి ఎలక్షన్లలోనూ పాల్గొనబోవడం లేదు. నా పేరు, ఫొటోలను పోస్టర్లలో వాడొద్దని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని తికాయత్ స్పష్టం చేశారు. మద్దతు ధరతోపాటు అన్నదాతలపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటామని ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చకుంటే మళ్లీ ఉద్యమాన్నిస్తామని హెచ్చరించారు. కాగా, వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గతేడాది నవంబర్ 26 నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు రైతులు ఉద్యమం చేశారు. ఎట్టకేలకు దిగొచ్చిన కేంద్రం.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజే ఈ చట్టాలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది.  

మరిన్ని వార్తల కోసం: 

ఐదుగురు క్రికెటర్లకు కరోనా

ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టిన భద్రతా దళాలు

సీడీఎస్ నియామకం వరకు సీఓఎస్సీ ఛైర్మన్ గా నరవాణే