సీడీఎస్ నియామకం వరకు సీఓఎస్సీ ఛైర్మన్ గా నరవాణే

సీడీఎస్ నియామకం వరకు సీఓఎస్సీ ఛైర్మన్ గా నరవాణే

ఢిల్లీ : ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవాణే చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ గా నియమితులయ్యారు. డిసెంబర్ 8న సీడీఎస్ బిపిన్ రావత్ మరణంతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్.. సీడీఎస్ పదవి ఖాళీ అయింది. దాన్ని భర్తీ చేసే వరకు పాత పద్దతిని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ క్రమంలో గతంలో అమలులో ఉన్న చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ పదవిని నరవాణేతో భర్తీ చేసింది. త్రివిధ దళాధిపతుల్లో నరవానే సీనియర్ కావడంతో ఆయనకు బాధ్యతలు అప్పజెప్పారు. సీడీఎస్ పోస్ట్ క్రియేట్ చేయడానికి ముందు త్రివిధ దళాధిపతుల్లో సీనియర్ అయిన అధికారి చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ గా వ్యవహరించేవారు. కొత్త సీడీఎస్ ఎంపిక పూర్తయ్యే వరకు నరవాణే ఈ  పదవిలో కొనసాగనున్నారు. 

For More news:

కొత్త ఓటు నమోదుకు ఏడాదికి నాలుగు సార్లు ఛాన్స్

వ్యాక్సిన్‌ బూస్టర్ డోసు తీస్కుంటే మంచిది