ఐదుగురు క్రికెటర్లకు కరోనా.. టెన్షన్లో విండీస్ బోర్డు

ఐదుగురు క్రికెటర్లకు కరోనా.. టెన్షన్లో విండీస్ బోర్డు

పాకిస్థాన్ టూర్ లో ఉన్న వెస్టిండీస్ జట్టులో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే ముగ్గురు ప్లేయర్లకు కొవిడ్ సోకగా.. తాజాగా మరో ఐదుగురు క్రికెటర్లకు పాజిటివ్ గా తేలింది. వికెట్ కీపర్ షై హోప్, లెఫ్టార్మ్ స్పిన్నర్ అకీల్ హోస్సేన్, ఆల్ రౌండర్ జస్టిన్ గ్రీవ్స్ తోపాటు అసిస్టెంట్ కోచ్ రాడీ ఎస్ట్ విక్, ఫిజీషియన్ అక్షాయ్ మాన్ సింగ్ కరోనా బారిన పడ్డారు. ఫాస్ట్ బౌలర్ షెల్డన్ కాట్రెల్, ఆల్ రౌండర్లు రోస్టన్ ఛేజ్, కైల్ మేయర్స్ కు శనివారం కరోనా పాజిటివ్ గా తేలింది. 

కాగా, ఈ నెల 18, 20, 22వ తేదీల్లో పాక్, విండీస్ జట్ల మధ్య వన్డే సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో వరుసగా కరీబియన్ క్రికెటర్లు కరోనా బారిన పడుతుండటంతో ఈ సిరీస్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం ఉన్నాయి. ఒకవేళ సిరీస్ రద్దయితే పాకిస్థాన్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. టీ20 ప్రపంచ కప్ కు ముందు భద్రతా కారణాలు చూపి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టీమ్స్ పాక్ పర్యటనను రద్దు చేసుకోవడం గమనార్హం. 

మరిన్ని వార్తల కోసం: 

సొంత చెల్లిని పెళ్లాడిన అన్న

దుర్గా పూజకు అరుదైన గుర్తింపు

సీడీఎస్ నియామకం వరకు సీఓఎస్సీ ఛైర్మన్ గా నరవాణే