ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టిన భద్రతా దళాలు

ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టిన భద్రతా దళాలు

కుల్గాం: జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులను టార్గెట్ గా చేసుకుని భద్రతా దళాలు, పోలీసులు వరుసగా ఎన్ కౌంటర్లకు దిగుతున్నారు. టెర్రరిస్టులు ఉన్న సమాచారం అందితే వారిపై అటాక్ చేస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్లు, కూంబింగులతో ఉగ్రవాదులను మట్టుబెట్టడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. తాజాగా రెండ్రోజుల్లో ముగ్గురు టెర్రరిస్టులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. కుల్గాం జిల్లాలోని రెడ్వానీ ఏరియాలో టెర్రరిస్టులకు సెక్యూరిటీ ఫోర్సెస్ కు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. టెర్రరిస్టుల కోసం ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. 

కాగా, పుల్వామాలో భద్రతా దళాలు జరిపిన ఎన్ కౌంటర్లో ఓ హిజ్బుల్ కమాండర్ చనిపోయిన మరుసటి రోజే కుల్గాంలో మరో ఇద్దరు ఉగ్రవాదులను ఆర్మీ, పోలీసులు మట్టుబెట్టడం గమనార్హం. పుల్వామా కాల్పుల్లో చనిపోయిన ఉగ్రవాదిని ఫిరోజ్ అహ్మద్ దార్ గా గుర్తించారు. ఏ–కేటగిరీ టెర్రరిస్టుగా ఫిరోజ్ ను గుర్తించిన సెక్యూరిటీ ఫోర్సెస్.. 2018లో షోపియాన్ లోని జైన్ పొరాలో చోటు చేసుకున్న అటాక్ లో అతడ్ని నిందితుడిగా భావిస్తున్నారు. ఈ దాడిలో నలుగురు పోలీసులు మృతి చెందారు. ఈ అటాక్ తోపాటు పలు ఉగ్ర కార్యకలాపాల్లో ఫిరోజ్ కు హస్తం ఉందని తేలింది. 2017 నుంచి అతడు యాక్టివ్ గా ఉంటున్నాడని సమాచారం. 

మరిన్ని వార్తల కోసం: 

న్యూ ఇయర్​కు సర్కార్​ టార్గెట్ వెయ్యి కోట్లు

పని ఒత్తిడితో ప్రాణాలు పోతున్నయ్!

హైదరాబాద్ లో కంటైన్మెంట్ జోన్