పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది.. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని 10 రూపాయలు తగ్గించింది. ఈ తగ్గింది ఎవరికి అంటే.. ఆయిల్ కంపెనీలకు. మరీ మరీ వినండీ ఆయిల్ కంపెనీలకు మాత్రమే ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. ఈ ఆయిల్ కంపెనీలు.. అంటే HP, BP, IOC కంపెనీలు ధరలు తగ్గించినప్పుడు మాత్రమే.. అది వినియోగదారులకు.. అంటే మన పెట్రోల్ బంకుల్లో తగ్గింపు ఉంటుంది. ఇప్పుడు మాత్రం అలాంటిది ఏమీ లేదు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గలేదు.. తగ్గింపు లేదు.
వినియోగదారులపై భారం పడుతుంది., అప్పుడు పెట్రోల్, డీజిల్ పై భారీగా పెంపు ఉంటుంది. దీని వల్ల మార్కెట్ లో అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. దీన్ని కంట్రోల్ చేయటం కోసం.. ఆయిల్ కంపెనీల నుంచి కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నులను తగ్గించింది. అంటే ఆయిల్ కంపెనీలు.. క్రూడ్ ఆయిల్ కొనుగోలు మోస్తున్న అధిక భారాన్ని.. కేంద్రం తన పన్నుల వాటా తగ్గించటం ద్వారా లెవల్ చేసింది. సో.. ఇప్పుడు ఆయిల్ కంపెనీలపై భారం అనేది లేకుండా లెవల్ అయిపోయింది.
అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకిన వేళ భారత ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ పన్ను తగ్గింపు వల్ల సామాన్యుడికి బంకుల్లో రేట్లు తగ్గుతాయా? లేక ఈ ఉపశమనం కేవలం ఆయిల్ కంపెనీలకేనా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి కేంద్రం తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.. పెట్రోల్ ధరలను తగ్గించడం కంటే, పెరగకుండా అడ్డుకట్ట వేయడమే.
ALSO READ : శ్రీరామ నవమి రోజున నష్టాల్లో మార్కెట్లు.. భారీ అమ్మకాలకు కారణాలు ఇవే..!
ప్రస్తుతం ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన మార్కెట్ అతలాకుతలమవుతోంది. హోర్ముజ్ జలసంధి గుండా రవాణా నిలిచిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర కేవలం నెల రోజుల్లోనే బ్యారెల్‌కు 70 డాలర్ల నుంచి 122 డాలర్లకు చేరింది. దీని ప్రభావంతో ఆఫ్రికా, ఐరోపా, ఆగ్నేయాసియా దేశాల్లో పెట్రోల్ ధరలు 30% నుంచి 50% వరకు వెంటనే పెరిగాయి. ఈ గ్లోబల్ సంక్షోభం భారత్‌పై పడకుండా ఉండాలంటే.. ప్రభుత్వం ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి.. ఇతర దేశాల మాదిరిగా లీటర్ ధరను భారీగా పెంచి ప్రజలపై భారం వేయడం. ఇక రెండోది.. ప్రభుత్వ ఆదాయానికి గండి పడ్డా సరే, పన్నులు తగ్గించి ఆ భారాన్ని తామే భరించడం. వీటిలో మోడీ ప్రభుత్వం రెండో మార్గాన్నే ఎంచుకుంది.
తగ్గించిన ధరలు ఎవరికి వెళతాయి.. ఎందుకు ఇలా :
ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం.. పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 13 నుండి రూ. 3కి, డీజిల్‌పై రూ.10 నుండి సున్నాకు తగ్గించారు. ఈ భారీ తగ్గింపు వల్ల ప్రజలకు నేరుగా బంకుల్లో ధరలు తగ్గవు. ఎందుకంటే.. అంతర్జాతీయంగా ధరలు పెరగడం వల్ల భారతీయ ఆయిల్ కంపెనీలు ప్రస్తుతం పెట్రోల్‌పై లీటరుకు రూ.24, డీజిల్‌పై రూ.30 చొప్పున భారీ నష్టాలను వస్తున్నాయి. కేంద్రం ప్రకటించిన పన్ను రాయితీలతో ఆయిల్ కంపెనీలు నష్టాలను పూడ్చుకోనున్నాయి. ఒకవేళ ప్రభుత్వం ఈ పన్నులను తగ్గించకపోయి ఉంటే.. ఆయిల్ కంపెనీలు తమ నష్టాలను పూడ్చుకోవడానికి రిటైల్ ధరలను భారీగా పెంచాల్సి వచ్చేది. అంటే ఈ పన్ను తగ్గింపు వల్ల సామాన్యుడికి ధర తగ్గకపోయినా, పెరగకుండా రక్షణ కవచంలా మారనుంది.
దేశీయ అవసరాలను పక్కన పెట్టి విదేశాలకు ఇంధనాన్ని ఎగుమతి చేసే రిఫైనరీలపై ప్రభుత్వం 'ఎగుమతి పన్ను' విధించింది. తద్వారా దేశంలో ఇంధన లభ్యత తగ్గకుండా జాగ్రత్త పడింది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం తన పన్ను ఆదాయాన్ని వదులుకుని ఆయిల్ కంపెనీల నష్టాల భారాన్ని తగ్గించేందుకే ప్రస్తుతం ఎక్సైస్ డ్యూటీ తగ్గింపు నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు మండిపోతున్నా, భారత వినియోగదారుడు ఆ తీవ్రతకు గురికాకుండా స్థిరమైన ధరల వద్ద ఇంధనాన్ని పొందే అవకాశం కలిగింది. సో పెట్రోల్ బంకుల్లో ఇప్పుడు ఉన్న రేట్లే కొనసాగుతాయి కానీ కేంద్రం ప్రకటించిన పన్ను రాయితీ సామాన్య వాహనదారులకు వర్తించదు.
