డౌటే లేదు.. రష్యా నుంచి ఆయిల్ బరాబర్ కొంటాం : అమెరికాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఇండియా

డౌటే లేదు.. రష్యా నుంచి ఆయిల్ బరాబర్ కొంటాం : అమెరికాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఇండియా

అమెరికా టారిఫ్స్ హెచ్చరికలపై ఇండియా ధిక్కార స్వరం పెంచుతూనే ఉంది. రష్యా నుంచి ఆయిల్ కొంటే.. టారిఫ్స్ కాదు.. ఇండియాపై సాంక్షన్స్ విధిస్తామని ట్రంప్ బెదిరింపులకు దిగటంతో.. అందుకు తగినట్లుగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది భారత్. 

రష్యా నుంచి బరాబర్ ఆయిల్ కొంటాం. కొంటూనే ఉంటాం. అందులో డౌటే లేదు. దేశ ప్రయోజనాల కోసం ఎంతవరకైనా వెళ్తాం అని భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దేశానికి ఏది అవసరమో అదే చేస్తాం.. అది ఆయిల్ అయినా.. లాజిస్టిక్స్ అయినా.. మరేదైనా.. ఎవరో ఒత్తిడి చేస్తారని భయపడే ప్రసక్తే లేదని శుక్రవారం (సెప్టెంబర్ 05) ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నందున ఇండియాపై ఆగస్టు 27 నుంచి 50 శాతం టారిఫ్స్ విధించామని.. మున్ముందు సాంక్షన్స్ కూడా విధిస్తామని.. ట్రంప్ చేసిన వ్యాఖ్యల తర్వాత ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 

►ALSO READ | పీటర్ నవారో చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు: ట్రంప్ సలహాదారుడి వ్యాఖ్యలపై ఇండియా ఆగ్రహం

భారత్ పై టారిఫ్స్ ఇంకా ముగియలేదని.. ఫేస్ -1, ఫేస్ -2, ఫేస్ -3 టారిఫ్స్ ఉంటాయని ట్రంప్ లేటెస్ట్ గా కామెంట్ కామెంట్ చేశాడు. రష్యా నుంచి ఆయిల్ కొనటం కంటిన్యూ చేస్తే దశలవారీగా టారిఫ్స్ ఉంటాయన్న ట్రంప్ వ్యాఖ్యలకు కౌంటర్ గా నిర్మలా ఈ కామెంట్స్ చేశారు.