
గోఆధారిత పంటల సాగుతోనే ఆరోగ్యం సేఫ్
బషీర్బాగ్, వెలుగు : గోవధ నిషేధ చట్టం తీసుకోవచ్చేలా పార్లమెంట్ లో తన గళాన్ని వినిపిస్తానని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన నమో మిషన్ వందే గౌ మాతరం సంస్థ ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా కృష్ణయ్యను హాజరయ్యారు.
నమో మిషన్ వందే గౌమాతరం యూఎస్ఏ ఎంపవర్‌మెంట్ వింగ్ అధ్యక్షుడిగా నియామక పత్రాన్ని కీర్చిపల్లి రాజుకు అందచేశారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. గోవులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. గోమూత్రం కొన్ని రకాల వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుందని, ముఖ్యంగా చర్మ వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారన్నారు.
గతంలో గో ఆధారిత వ్యవసాయం చేయడం వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారని, ప్రస్తుతం ఫెర్టిలైజర్స్ వాడటం వల్ల పర్యావరణం కలుషితంతో పాటు ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారన్నారు. భవిష్యత్తులో ఆర్గానిక్ పంటల ఉపయోగానికి గోవులు ఎంతో తోడ్పాటునందిస్తాయని ఆర్. కృష్ణయ్య తెలిపారు. గో మాత మిషన్ చైర్మన్ మాధవ్ రాజ్, సభ్యులు కవిత , హైందవి, సుధాకర్, అంజి, వైభవ్
పాల్గొన్నారు.