స్కైలో మ్యాజిక్.. గ్రౌండ్‎లో మ్యూజిక్.. మూడో రోజూ దుమ్మురేపిన వింగ్స్ ఇండియా ప్రదర్శన

స్కైలో మ్యాజిక్.. గ్రౌండ్‎లో మ్యూజిక్.. మూడో రోజూ దుమ్మురేపిన వింగ్స్ ఇండియా ప్రదర్శన

హైదరాబాద్: బేగంపేట్ ఎయిర్‌పోర్టులో ‘వింగ్స్ ఇండియా-2026’ ప్రదర్శన మూడో రోజూ ఉత్సాహంగా కొనసాగింది. ఆఖరి రెండ్రోజులు సాధారణ ప్రజలకు అనుమతి ఇవ్వడంతో శుక్రవారం పెద్దసంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. ఎయిర్​షోలు, ఏరోబాటిక్ డిస్​ప్లేలు, ఎగ్జిబిషన్​లను ఆస్వాదించారు. భారత వాయుసేనకు చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ మధ్యాహ్నం 11:30 గంటల నుంచి అద్భుతమైన ఏరోబాటిక్ డిస్‌ప్లే చేసింది. 

ట్రైకలర్ స్మోక్ ట్రయిల్స్, డీఎన్ఏ మాన్యువర్‌లతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. యూకే నుంచి వచ్చిన గ్లోబల్ స్టార్స్ ఏరోబాటిక్ టీమ్ డెత్ డిఫైయింగ్ మూవ్స్, రోల్స్, లూప్స్, వర్టికల్ డ్రాప్స్​తో ఆకట్టుకుంది. సాయంత్రం సింగర్ ఉషా ఉతుప్ సంగీత ప్రదర్శన ఉర్రూతలూగించింది. శుక్రవారం దాదాపు 9 నుంచి 10 వేల మంది ప్రజలు ఎయిర్‌షోను వీక్షించేందుకు వచ్చారని అంచనా. నేటితో ఎయిర్‌షో ముగియనుంది. -