అరెయ్​, గట్ల సూస్తవేందిరా.. తింటవా ఏంది!

అరెయ్​, గట్ల సూస్తవేందిరా.. తింటవా ఏంది!

‘అరెయ్​, గట్ల సూస్తవేంది రా. నీకు దండం పెడతా అట్ల సూడకు ర బై. తింటవా ఏంది? ఏందిరో కాలు లేపినవ్​.. నోరు తెరుస్తున్నవ్​! వద్దురా.. పోరా ఇక్కడ్నుంచి. వామ్మో వీడు తినేసేటట్టుండు.. హెల్ప్​ హెల్ప్​’ అన్నట్టుంది కదా ఈ ఫొటో. జస్ట్​ ఆ ‘మూమెంట్​’ను కెమెరాలో క్లిక్​మనిపించినందుకు టిబెట్​కు చెందిన యోంఖింగ్​ బావో అనే ఫొటోగ్రాఫర్..​ వైల్డ్​లైఫ్​ ఫొటోగ్రాఫర్​ ఆఫ్​ ద ఇయర్​గా నిలిచాడు. చైనాలోని ఖిలియన్​ మౌంటెయిన్స్​ నేషనల్​ నేచర్​ రిజర్వ్​లో ఆ ఫొటో తీశాడు. 100 దేశాల నుంచి 48 వేల ఎంట్రీలొచ్చినా, ఈ ఫొటోనే జడ్జిలను మెప్పించింది. నెంబర్​ వన్​గా నిలిచింది.