ఇప్పుడిప్పుడే వానలు తగ్గడంతో జనం కాస్త రిలాక్స్ అవుతున్నారు. ఇంతలోనే చలి నేను ఉన్నా అంటూ వస్తోంది. దీంతో జనం స్వెట్టర్ల దుమ్ము దులుపుతున్నారు. మరికొందరు స్వెట్టర్లు కొనేందుకు బారులుదీరుతున్నారు. కరీంనగర్ సిటీలోని తెలంగాణ చౌక్‌లో జ్యోతిబాపూలే పార్క్ ఎదురుగా నేపాలీలు ఏర్పాటు చేసిన స్వెట్టర్ల షాపుల వద్ద సోమవారం జనం రద్దీ కనిపించింది. -వెలుగు ఫొటోగ్రాఫర్, కరీంనగర్
