
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌తో మూడేళ్లుగా యుద్ధం చేస్తోన్న రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తూ.. ఓపెన్ మార్కెట్లో ఎక్కువ లాభాలకు అమ్ముకుంటుందంటూ భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. రష్యా తీరుతో ఎంతో మంది ప్రాణాలు పోతున్న పట్టింపే లేదని భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. ఈ క్రమంలో ట్రంప్ వ్యాఖ్యలకు ఇండియన్ ఆర్మీ కౌంటర్ ఇచ్చింది. 1971 పాక్-భారత్ యుద్ధ సమయంలో పాకిస్తాన్‌కు అమెరికా ఆయుధాల సరఫరా చేసిన విషయాన్ని గుర్తు చేసింది.
ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తోన్న రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేయడం తప్పు అయితే.. మరీ 1971 ఇండియాపాక్ వార్ టైమ్‌లో పాకిస్థాన్‌కు అమెరికా ఆయుధాలు సరఫరా చేయడాన్ని ఏమంటారని పరోక్షంగా ట్రంప్‌కు కౌంటర్ ఇచ్చింది. మేం చేస్తే తప్పు.. అదే పని మీరు చేస్తే కరెక్టా అన్నట్లుగా ట్రంప్ దిమ్మతిరిగేపోయేలా నిలదీసింది. ఇందుకు సంబంధించిన పేపర్ క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఆర్మీ ఈస్ట్ కమాండ్.
1971, ఆగస్టు 5.. ఈ రోజు, ఆ సంవత్సరం యుద్ధం ప్రారంభమైందని ఈ పోస్టులో రాసుకొచ్చింది. ఆర్మీ ఈస్ట్ కమాండ్ షేర్ చేసిన కథనం సారాంశమేమిటంటే.. 1954 నుంచి పాకిస్తాన్‌కు 2 బిలియన్ల విలువైన యూఎస్ ఆయుధాలు రవాణా చేయబడ్డాయని. ఈ ఆర్టికల్‌ను అప్పటి రక్షణ ఉత్పత్తి మంత్రి వీసీ శుక్లా పార్లమెంటులో చేసిన ప్రసంగాన్ని ఉటంకిస్తూ రాశారు.
ఇందులో ఫ్రాన్స్, సోవియట్ యూనియన్ (రష్యా) పాకిస్తాన్‌కు ఆయుధాల అమ్మకాలను తిరస్కరించినప్పటికీ.. అమెరికా మాత్రం దాయాది దేశానికి ఆయుధాల సరఫరాను కొనసాగించిందని ప్రస్తావించారు. యుద్ధంలో పాకిస్థాన్‌కు చైనా, అమెరికా రెండు దేశాలు ఆయుధ సహయం అందజేశాయని పేర్కొన్నారు. ఆ రెండు దేశాల ఆయుధాలతోనే 1971 వార్‌లో పాకిస్థాన్ భారత్‌పై పోరాడిందని రాశారు. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేయడం కరెక్ట్ కాదంటూ ట్రంప్ వ్యాఖ్యానించిన 24 గంటల్లోనే భారత ఆర్మీ గతాన్ని గుర్తు చేసి అమెరికా అధ్యక్షుడికి ఇన్‌డైరెక్ట్‌గా కౌంటర్ ఇచ్చింది.
#IndianArmy#EasternCommand#VijayVarsh #LiberationOfBangladesh #MediaHighlights
— EasternCommand_IA (@easterncomd) August 5, 2025
"This Day That Year" Build Up of War - 05 Aug 1971 #KnowFacts.
"𝑼.𝑺 𝑨𝑹𝑴𝑺 𝑾𝑶𝑹𝑻𝑯 $2 𝑩𝑰𝑳𝑳𝑰𝑶𝑵 𝑺𝑯𝑰𝑷𝑷𝑬𝑫 𝑻𝑶 𝑷𝑨𝑲𝑰𝑺𝑻𝑨𝑵 𝑺𝑰𝑵𝑪𝑬 '54"@adgpi@SpokespersonMoD… pic.twitter.com/wO9jiLlLQf