కుట్రపూరితంగా సెంటిమెంట్ రగిలించాలని చూస్తున్నారు

కుట్రపూరితంగా సెంటిమెంట్ రగిలించాలని చూస్తున్నారు
  • తెలంగాణ నుంచి బీజేపీని దూరం చేయడం ఎవరితరం కాదు

హైదరాబాద్: పార్టీలు, రాజకీయాలకు అతీతంగా బీజేపీ పాలన సాగిస్తోందని.. తెలంగాణపై మోడీ ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపలేదని  పార్టీ సీనియర్ నేత మురళీధర్ రావు అన్నారు. ధాన్యం సేకరణ అంశంపై కేసీఆర్ సహా.. టీఆర్ఎస్ నేతలందరూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారని ఆయన విమర్శించారు. కుట్రపూరిత ఆలోచనతో ఢిల్లీ వర్సెస్ తెలంగాణ అనే నినాదం తేవాలని, తెలంగాణ ప్రజల సెంటిమెంట్ రగిల్చాలని టీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తుందని మురళీధర్ రావు ఆరోపించారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీని తెలంగాణ నుంచి దూరం చేయడం ఎవరి తరం కాదన్నారు. టీఆర్ఎస్ పాలనలోనే డ్రగ్స్ వాడకం పెరిగిందని.. లోతుగా దర్యాప్తు జరిగితే టీఆర్ఎస్ తీగ బయటకు వస్తుందన్నారు. డ్రగ్ మాఫియా మూలాలతో టీఆర్ఎస్ కు సంబంధాలున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ సహకారం లేనిదే డ్రగ్ మాఫియా సాగదని... పంజాబ్ లో ప్రభుత్వం మారడానికి కారణం డ్రగ్ మాఫియానే అని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు డ్రగ్స్ వాడితే కేసులు పెట్టండని మురళీధర్ రావు స్పష్టం చేశారు. 

 

 

ఇవి కూడా చదవండి

స్వీపర్ల వద్ద  నెలవారీగా మామూళ్ల వసూలు

రైతులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చెలగాటం

రాజ్యసభ నుంచి టీఆర్ఎస్ ఎంపీల వాకౌట్

ఆస్తినంతా రాహుల్‌ గాంధీకి రాసిచ్చిన పుష్ప