ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండస్ట్రీతో.. ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి : తుమ్మల

ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండస్ట్రీతో.. ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి : తుమ్మల
  • రూ.1,050 కోట్లతో ఏర్పాటు చేస్తం: తుమ్మల
  • మంత్రిగా బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్, వెలుగు: ఆయిల్ పామ్ ఇండస్ట్రీతో అన్ని జిల్లాల్లో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. రైతు జీవన ప్రమాణాలు మెరుగుపడ్తాయని తెలిపారు. సెక్రటేరియెట్​లో శుక్రవారం తుమ్మల నాగేశ్వర రావు మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో ఐదు ఆయిల్ పామ్ ఇండస్ట్రీల ఏర్పాటు ఫైల్​పై తొలి సంతకం చేశారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఐదు ఆయిల్ పామ్ ఇండస్ట్రీలు ఏర్పాటు చేసేందుకు రూ.1,050 కోట్లు ఖర్చు చేస్తాం. రూ.4.07 కోట్లతో రాష్ట్రంలోని 110 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే టెక్నాలజీని అందించే ఫైల్​పై రెండో సంతకం చేశా. పంట సాగులో అత్యాధునిక పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తాం. అగ్రికల్చర్ సైంటిస్టులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు చేస్తారు.

సహకార వ్యవస్థలో పారదర్శకమైన పాలన అందిస్తాం. దీనికి గాను వివిధ విభాగాలను పూర్తిగా కంప్యూటరీకరణ చేసేందుకు అవసరమైన చర్యలపై మూడో సంతకం చేశాను”అని మంత్రి తుమ్మల తెలిపారు. ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో వచ్చే ఐదేండ్లలో ఏడాదికి ఒకటి చొప్పున పామాయిల్ ఇండస్ట్రీలు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర వాతావరణ పరిస్థితులు కూడా సాగుకు అనుకూలంగా ఉన్నాయని వివరించారు. 25 ఏండ్ల నుంచి 30 ఏండ్ల దాకా దిగుబడి ఇచ్చే దీర్ఘకాలిక పంట అని తెలిపారు. సంప్రదాయ పంటలతో పోలిస్తే పామాయిల్ సాగుతో రైతులకు ఎకరాకు రూ.లక్ష వరకు ఆదాయం వస్తుందన్నారు. అనంతరం గద్వాలకు చెందిన పట్టు పరిశ్రమ శాఖ అధికారి జగన్నాథ్ కొడుకు ఆశిష్ కుమార్​కు కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పిస్తూ నియామకపత్రం అంద జేశారు.