
ఆస్ట్రేలియా విధ్వం సక బ్యాట్స్ మన్ డేవిడ్ వార్నర్ రాకతో సన్ రైజర్స్ బలం మరిం త పెరిగిందని యువ ఆల్ రౌండర్ దీపక్ హుడా అన్నాడు. కేన్ విలియమ్సన్ , డేవిడ్ వార్నర్ రూపంలో ఇద్ద రు గొప్ప నాయకులు ఉండడం టీమ్ కు ఎంతో మేలు చేస్తుందని తెలిపాడు. బాల్ ట్యాం పరిం గ్ ఉదంతంతో ఏడాది బ్యాన్ కు గురైన వార్నర్ ఐపీఎల్ 11వ సీజన్ కు దూరమయ్యాడు. ఈ నెల 30తో నిషేధంముగి యనుండటంతో తిరిగి తాజా సీజన్ లో బరిలో దిగనున్నాడు. ఇప్పటికే నగరానికి చేరుకున్న ఈ ఆసీస్ ఓపెనర్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో తన బ్యాట్ పవరేంటో చూపాడు. ఈ నేపథ్యంలో దీపక్ మాట్లా డుతూ.. ‘వార్నర్ ఎప్పుడూ జట్టుకు స్ఫూర్తిదాయకమే. టీమ్ ను ముందుం డి నడిపించాలనే అతడి ఆటిట్యూడ్ కందరికీ ఎంతో నచ్చుతుంది. వార్నర్ రాకతో టీమ్ కాన్ఫి డెంట్ లెవల్స్ పెరిగాయి. ఇది మాకు బూస్టప్ వంటిది. వార్నర్ విలియమ్సన్ ఇద్ద రూ డ్రెస్సిం గ్ రూమ్ లో చాలా సైలెంట్ గా ఉంటారు. బరి లో దిగాక మాత్రం ఎవరికి వారే ప్రత్యేక ప్లాన్స్‌తో ముందుకు వెళ్తారు. ముఖ్యంగా ఒత్తిడి సమయాల్లో బౌలర్లకు సలహాలు ఇవ్వడంలో విలియమ్సన్ తెలివిగా వ్యవహరిస్తా డు. అతనో అద్భుత కెప్టెన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. గతేడాది అతని సారథ్యంలోనే జట్టు ఫైనల్ చేరింది. డెత్ ఓవర్లలో అతను తరచూ బౌలర్లతో మాట్లా డుతూ ఒత్తిడి దరి చేరనివ్వకుండా చూసుకుంటాడు. ఇవి చిన్న విషయాలే నిపిం చినా.. ఫలితంపై పెద్ద ప్రభావం చూపుతాయి’అని అన్నాడు. 2016లో సన్ రైజర్స్ ఐపీఎల్ ట్రోఫీ సాధించడంలో వార్నర్ ప్రముఖ పాత్ర పోషించా డని.. గత సీజన్ లో వార్నర్ లేకున్నా.. విలయమ్సన్ సారథ్యంలోని రైజర్స్ ఫైనల్ చేరిం దని అన్నాడు. మహ్మద్ నబీ, షకీబ్ , యుసుఫ్ పఠాన్ రూపంలో రైజర్స్ కు మంచి ఆల్ రౌండర్స్ బ్యా కప్ ఉందని దీపక్‌చెప్పుకొచ్చాడు.
బౌలర్ల కే ఎక్కువ చాలెంజింగ్ : థంపి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ ) వల్ల ఏ బ్యాట్ స్ మన్ కు ఎలా బంతులేయాలనే విషయం బాగా తెలిసొచ్చిందని.. వరల్డ్ బెస్ట్ బ్యాట్ స్ మన్ ను ఎలా బోల్తాకొట్టించా లో నేర్చు కున్నానని కేరళ యువ పేసర్ బాసిల్ థంపి అంటున్నాడు. ఈ లీగ్ బ్యాట్ స్ మెన్ కంటే బౌలర్లకే ఎక్కువ చాలెంజింగ్ అని బెస్ట్ ప్లేయర్లను కట్టడి చేసేం దుకు అంతకుమించి బెస్ట్ ఇవ్వాల్సి ఉంటుం దని చెప్పుకొచ్చాడు. గతంలో గుజరాత్ లయన్స్ కు ఆడిన థంపీ మూ డేళ్లుగా సనరైజర్స్ తరఫున బరిలో దిగుతున్నాడు.‘ఐపీఎల్లో బౌలిం గ్ చేయడం చా లెంజ్ తోకూడుకుంది. ఇది బ్యాట్ స్ మెన్ గేమ్ అనే విషయం అందరికీ తెలుసు. గత మూడేళ్లలో చాలా కాన్ఫిడెన్స్ సంపాదించా . ఎవరికి ఎలాంటి బంతులు వేయాలో నేర్చుకున్నా. కెప్టెన్ ఎప్పుడు నా వైపు బంతి విసిరినా .. నా బెస్ట్ ఇచ్చేం దుకు ప్రయత్నిస్తా’అని థంపి అన్నాడు. సన్ రైజర్స్ టీమ్ లో భువనేశ్వర్ కుమార్ , సందీప్ శర్మ, సిద్ధా ర్థ్ కౌల్ , ఖలీల్ అహ్మద్ , బిల్లీ స్టాన్ లేక్ వంటి పేసర్లు ఉండటంతో థంపికి ఎక్ కువ మ్యాచ్ లు ఆడే అవకాశం కనిపిం చడంలేదు. ఈ లీగ్ లో సన్ రైజర్స్ తమ తొలి మ్యాచ్ ను ఈ నెల 24న కోల్ కతా నైట్ రైడర్స్ తో ఆడనుం ది. మరోవైపు సన్‌రైజర్స్ టీమ్ ప్రచా రంలో భాగంగా టీవీ యాంకర్ సుమతో కలిసి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సుమ జట్టు సభ్యు లకు వీర తిలకం దిద్ది స్వీట్లు తినిపించడం ఆకట్టుకుంది.