LRSతో తెలంగాణ ప్రభుత్వం ప్రజలపై అధిక భారం వెూపుతోంది

LRSతో తెలంగాణ ప్రభుత్వం ప్రజలపై అధిక భారం వెూపుతోంది

ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రజలపై అధిక భారం వెూపుతోందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. దీంతో పేద,మద్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. దుబ్బాక ప్రచారంలో ఆయన ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకుని వెళుతున్నారు. అధికార పార్టీ నేతలను ఎల్‌ఆర్‌ఎస్‌పై నిలదీయాలని అన్నారు. ప్రజలపై వెూపిన ఈ భారాన్ని ఉపసంహరించుకుని వెంటనే ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలన్నారు. లే అవుట్‌ అనుమతులు ఉంటేనే రిజిస్టేషన్లు చేయాలని ప్రభుత్వం ముందే చెప్పి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదన్నారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంపై ఆధారపడ్డ వారు మాత్రమే స్పందించే వారని చెప్పారు. ప్రభుత్వ వైఖరి వల్ల ప్రజలందరిపై భారం వెూపినట్ల యిందన్నారు. ఇకపోతే మక్క రైతులకు ఆలస్యంగా అయినా ప్రభుత్వం న్యాయం చేయాలని నిర్ణయించడం మంచి పరిణామమన్నారు. రైతులు తమకు అనుకూలంగా ఉండే పంటలను పండిస్తారని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కనీస బాధ్యత అన్నారు. నూతన వ్యవసాయ చట్టం కార్పొరేట్‌ సంస్థల కోసమేనని అన్నారు.