వామ్మో.. సూపర్​ ట్రిక్​.. రోలింగ్​ పిన్​ లేకుండా పూరీ.. 

వామ్మో.. సూపర్​ ట్రిక్​.. రోలింగ్​ పిన్​ లేకుండా పూరీ.. 

సోషల్​ మీడియా వచ్చిన తరువాత  జనాలు తెగ హడావిడి చేస్తున్నారు.  కొంతమంది సాహసాలు చేసి పాపులర్​ అయితే మరి కొంతమంది వంటింటి చిట్కాలు ఉపయోగించి సోషల్​ మీడియాలో పరుగులు పెడుతున్నారు. ప్రతి రోజు తిన్నా సరే.. సోషల్​మీడియాలో ఏదైనా  వంటకం పోస్ట్​ అయితే చాలు.. వైరల్​ అవుతుంది.  దానికి తగ్గట్టే జనాలు కూడా ఐటం పాతదైనా.. కొత్త పద్దతులు జోడించి సోషల్​మీడియాలో పోస్ట్​ చేస్తున్నారు.  ఇప్పుడు అలాగే చపాతీ, పూరీ వంటకం సోషల్ మీడియాను షేక్​ చేస్తుంది.  అందులో ఏముందంటే...

చపాతీలు, పూరీలు  చేయాలంటే  పిండిని చిన్న చిన్న ఉండలు చేసి .. రోలింగ్​ పిన్​తో పల్చగా చేసిన తరువాత పెనంపై కాల్చడం.. లేదా నూనెలో వేయిస్తారు.  ఇదంతా పాత పద్దతి అంటుంది ఓ మహిళ.  చపాతీ.. పూరీలు చేయడానికి అసలు రోలింగ్​పిన్​ అవసరం లేకుండా తయారు చేశారు.  అంతే కాదు.. చాలా తక్కువ సమయంలో చపాతీలు.. పూరీలు తయారు చేసే ప్రక్రియను సోషల్​ మీడియాలో పోస్ట్​ చేసింది.  ఈ వీడియో ఇంటర్​ నెట్​ లో సంచలనం సృష్టించింది. 

మెత్తగా తయారైన పూరీ పిండిని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి .. ఒక దానికొకది దూరంగా  ప్లాస్టిక్​ షీట్ లోని సగ భాగంలో ఉంచారు.  మిగతా సగ భాగాన్ని ఆ వుండలపై కప్పి.. . దానిపై రోలింగ్​ బోర్డుతో నొక్కారు.  ఈ వీడియోను Instagram వినియోగదారు రుచీ కేవాట్ (@itz_ruchi___123) పోస్ట్ చేసారు.దీనికి “బినా బెలన్ కి పూరీ (రోలింగ్ పిన్ లేని పూరిస్)” అని క్యాప్షన్​ ఇచ్చారు. ఈ వీడియో పోస్ట్​ చేసిన కొద్దిసేపటికే 5 మిలియన్లకు పైగా వీక్షణలు పొందింది.  

ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు.  చాలామంది ఇన్​స్టాగ్రామ్​ యూజర్స్​ ఈ మహిళను అభినందించారు. ... ఇది అద్భుతం..  దీనిని నేను కూడా ప్రయత్నిస్తానని కామెంట్​ చేశారు.  ఇంకొకరు సూపర్​ ఆలోచన అని ప్రశంశించారు.   ఈ పూరీ ట్రిక్​ ను అనుసరించాలంటూ మూడో వ్యక్తి రాశారు.  కొంతమంది..  ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు తొందరగా పూరీలు తయారు చేసేందుకు ఈ ట్రిక్​ చాలా ఉపయోగమని రాసుకొచ్చారు.