ఆకాశంలో అద్భుతం.. చందమామ జిగేల్ మంటూ వెలుగులు చిమ్ముతూ చూసేవారిని అబ్బురపర్చాడు.సాధారణ పౌర్ణమికంటే పెద్దదిగా, ప్రకాశవంతంగా చంద్రుడు కనిపించాడు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఆకాశంలో సూర్యాస్తమయం తర్వాత ప్రకాశవంతంగా, పెద్దగా దర్శనమిచ్చాడు. 2026లో తొలిసారి స్కైవాచర్లకు కనువిందు చేశాడు సూపర్ మూన్.
వోల్ఫ్ పౌర్ణమి సందర్భంగా కనిపించే ఈ సూపర్ మూన్ వోల్ఫ్ మూన్ అని కూడా అంటారు. సాధారణ పౌర్ణమికంటే పెద్దదిగా, ప్రకాశవంతంగా కనిపించింది. ఈ ఏడాది సాధారణ పౌర్ణమి కంటే దాదాపు 30 శాతం ప్రకాశవంతంగా , దాదాపు 14 శాతం పెద్దదిగా కనిపించాడు. చాలా మంది స్కైవాచర్లు ఎటువంటి ప్రత్యేక పరికరాలు లేకుండా దృశ్యాన్ని ఆస్వాదించారు.
గౌహతిలో చంద్రుడు వెచ్చని నారింజ-పసుపు రంగులో తక్కువ ఎత్తులో కనిపించాడు. భువనేశ్వర్, కోల్ కతా, లక్నోలలో కూడా ఇదే దృశ్యం కనిపించింది. అక్కడ ప్రజలు ప్రకాశించే చంద్రుని ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
జనవరి నెలలో వచ్చే పౌర్ణమి చంద్రుడిని వోల్ఫ్ మూన్ అని పిలుస్తారు. ఉత్తరాది జానపద కథల నుంచి ఈ పేరు వచ్చింది. అక్కడ ప్రజలు దీర్ఘ శీతాకాలపు రాత్రులలో తోడేళ్ళు ఎక్కువగా అరుస్తాయని నమ్ముతారు. చంద్రుడిని కొన్నిసార్లు యూల్ తర్వాత చంద్రుడు అని కూడా పిలుస్తారు.
సూపర్ మూన్ ను కంటితో చూడొచ్చు. అయితే బైనాక్యులర్లు, చిన్న టెలిస్కోప్ లను ఉపయోగించి చూస్తే చంద్రుని ఉపరితలం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అక్టోబర్ లో ప్రారంభమై నాలుగు నెలలు సాగిన సూపరమూన్ పరుగుకు సూపర్సూన్ ముగింపు పలికింది. ఇలాంటి అద్భుత దృశ్యాలను చూడాలంటే.. 2026 చివరి వరకు వేచి చూడాల్సిందే.
