బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోండి : ఢిల్లీ మహిళా కమిషన్ కు కంప్లయింట్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోండి : ఢిల్లీ మహిళా కమిషన్ కు కంప్లయింట్

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో ప్రాణహాని ఉందని ఓ మహిళ నేషనల్ విమెన్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది. సెజల్ అనే మహిళ ఆరిజిన్ డెయిరీ కో డైరెక్టర్ పని చేస్తోంది. అయితే ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తమను బ్లాక్ మెయిల్ చేస్తూ.. పోలీసులతో వేధింపులకు గురి చేస్తున్నాడని ఆమె తెలిపింది. ఎమ్మెల్యేపై తెలంగాణ పోలీసులకు చాలా సార్లు కంప్లయింట్ చేశామని.. ఎమ్మెల్యే తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని కంప్లయింట్ రిజిష్టర్ కానివ్వకుండా చేశాడని సదరు మహిళ వెల్లడించింది. 

ఈ మేరకు బాధితురాలు మే 29వ తేదీ సోమవారం ఢిల్లీలోని విమెన్ కమిషన్ కు ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసింది. తనకు తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని విమెన్ కమిషన్ హామీ ఇచ్చిందని బాధితురాలు వెల్లడించింది. సదరు మహిళ ఈ విషయాన్ని ఓ వీడియో ద్వారా పేర్కొంది. "తప్పు చేసింది ఎమ్మెల్యే అయినా.. ఎవరైనా వదిలిపెట్టేదిలేదు గుర్తుపెట్టుకోండి..ఇకనైనా ఎమ్మెల్యేగారు మీ అనుచరులతో బెదించండం..వేధింపులకు గురిచేయడం ఆపితే మీకే మంచిది" అని బాధితురాలు హెచ్చరించింది. అయితే బాధితురాలి ఫిర్యాదుతో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను విచారించేందుకు విమెన్ కమిషన్ నోటీస్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.